అధ్యాయం 13, శ్లోకం 9
9
ఇంద్రియార్థేషు వైరాగ్యమ్
అనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధి
దు:ఖదోషానుదర్శనమ్ ||
తాత్పర్యము : ఇంద్రియార్థముల పరిత్యాగము, మిథ్యాహంకార రాహిత్యము, జన్మమృత్యుజరావాధుల దోషమును గుర్తించుట.
భాష్యము :10.ఇంద్రియార్దేషు వైరాగ్యము : ఇంద్రియములను భగవంతుని సేవలలో వినియోగించుట. ప్రత్యేకించి నాలుకను హరేకృష్ణ మంత్రమును ఉచ్చరించుటలోనూ, భగవంతునికి అర్పించిన ప్రసాదముు స్వీకరించుటలోనూ వినియోగించవలెను.
11.అనహంకారము : నేను ఈ శరీరాన్ని అని భావించుట అహంకారమైతే, ‘నేను ఆత్మను’, అని అర్ధము చేసుకొనుట అనహంకారము అనబడుతుంది.
12.జన్మమృత్యుజ రా వ్యాధీ దు:ఖ దోషాను దర్శనం : వేదాలను శ్రవణము చేయుట ద్వారా జన్మ, మృత్యువు, ముసలితనము, రోగము అందరికీ తప్పని కష్టాలని తెలుసుోవడం ద్వారా ఆధ్యాత్మిక జీవితమును తీవ్రముగా పాటించుట.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..