Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 67
67.
ఇదం తే నాతపస్కాయ
నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం
న చ మాం యో భ్యసూయతి ||

తాత్పర్యము : ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి గాని, భక్తులు కానివారికి గాని, భక్తియుత సేవలో నిలువనివారికి గాని, నా యెడ అసూయను కలిగిన వారికి గాని ఎన్నడును వివరింపరాదు.

భాష్యము : శ్రీకృష్ణుడు భగవద్గీతలో, తాను భగవంతుడనని, తనకు మించిన వారు గాని, సమానులు గాని లేరని చెప్పి యుండుట చేత ఆయన పట్ల అనేకమంది అసూయను కలిగి ఉందురు. వారు మహా అయితే అయన ఒక గొప్ప చారిత్రాత్మిక వ్యక్తి అనో, అంత గొప్ప వ్యక్తి కాదనో భావించుదురు. అటువంటి విశ్వాశరహితులు భగవద్గీతను అర్థము చేసుకొనలేరు, సరి కదా వారి భగవద్గీతా వ్యాఖ్యానము పాఠకుల ను తప్పు దోప పట్టిస్తుంది. అంతేకాక ఇంద్రియ తృప్తికి బానిసలైన వారు కూడా ఎటువంటి ధర్మములను, తపములన ఆచరించలేరు కాబట్టి వారు కూడా భగవద్గీతను అర్థము చేసుకొనలేరు. ఇక భక్తులమని ప్రకటించి కృష్ణ చైతన్య సాధన చేయనట్లయితే వారునూ భగవద్గీతను అర్థము చేసుకొనలేరు. ఇక భక్తులమని ప్రకటించి కృష్ణ చైతన్య సాధన చేసినట్లయితే వారునూ భగవద్గీతను అర్థము చేసుకొనలేరు. ఇక భక్తులమని ప్రకటించి కృష్ణ చైతన్య సాధన చేయనట్లయితే వారునూ భగవద్గీతను అర్థము చేసుకొనలేను. అనగా శుద్ధ భవగత్‌ భక్తులు మాత్రమే భగవద్గీతను అర్థము చేసుకొన గలరు. ఆ విధమైన శుద్ధ భక్తుని ఆధ్వర్యంలో భగవద్గీతను నేర్వకుండా ఎవరూ భగవద్గీత పైన వ్యాఖ్యానము చేయరాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement