Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 38
38.
విషయేంద్రియసంయోగాత్‌
యత్తదగ్రే మృతోపమమ్‌ |
పరిణామే విషమివ
తత్సుఖం రాజసం స్మృతమ్‌ ||

తాత్పర్యము : ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కము నొందగా లభించున టువంటిదియు మరియు ఆదిలో అమృతము వలె, అంత్యమున విషమువలె తోచునదియు అయిన సుఖము రజోగుణ ప్రధానమైనదని భావింపబడును.

భాష్యము : ఒక యువకుడు ఒక యువతిని కలిసికొనినప్పుడు ఆ యువకున్ని అతని ఇంద్రియములు యువతిని చూచుటకు, స్పృశించుటకు ఆమెతో భోగించుటకు ప్రేరేపించును. ఆదిలో ఇట్టి సాంగత్యము ఇంద్రియములకు ప్రీతికరములుగనే తోచినను, ఆంత్యమున లేదా కొంతకాలమునకు అవి విషతుల్యమగును. వారొకరి నుండి ఒకరు విడిపోవుట లేక విడాకులు పుచ్చుకొనుటయో జరిగినపుడు దు:ఖము, విచారము వంటి భారములు కలుగుచుండును. అట్టి సుఖము సదా రజోగుణముతో కూడినట్టిది. అనగా ఇంద్రియములు మరియు ఇంద్రియార్ధముల సంయోగముచే లభించు సుఖము చివరకు దు:ఖకారణమే కాగలదు. కావున అది సర్వదా వర్జింపదగినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement