Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 37
37.
యత్తదగ్రే విషమివ
పరిణామేమృతోపమమ్‌ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్‌
ఆత్మబుద్ధిప్రసాదజమ్‌ ||

తాత్పర్యము : ఆది యందు విషప్రాయముగా నుండి అంత్యమున అమృతముతో సమానమగునదియు మరియు ఆత్మానుభూతి యెడ మనుజుని జాగృతుని చేయునదియు అయిన సుఖముసత్త్వ గుణముప్రధనమైనదని చెప్పబడును.

భాష్యము : ఆత్మానుభూతిని పొందుటకు మానవుడు, మనస్సు, ఇంద్రియములను నిగ్రహించుటకు మరియు మనస్సును ఆత్మ యందు కేంద్రీకరించుటకు వివిధ నియమ నిబంధనలను అనుసరింపవలసి వచ్చును. ఆ విధి విధానములు అన్నియును కష్టమగుటచే ఆదిలో అవి మిక్కిలి విషము వలె ఉండును. కాని మానవడు ఆ నియమములను అనుసరించుట యందు సఫలీకృతుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగినచో అతడు నిజమైన అమృతా స్వాదనమును ప్రారంభించి సుఖ జీవితమును అనుభవించును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement