Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 32
32.
అధర్మం ధర్మమితి యా
మన్యతే తమసావృతా |
సర్వార్థాన్‌ విపరీతాంశ్చ
బుద్ధి: సా పార్థ తామసీ ||

తాత్పర్యము : ఓ పార్థా! అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మమును ధర్మముగాను మరియు ధర ్మమును అధర్మముగాను భావించుచు, ఎల్లపుడును తప్పుద్రోవ పట్టునటువంటి బుద్ధి తామస గుణమును కూడినట్టిది.

భాష్యము : తమో గుణముతో కూడిన బుద్ధి సదా వర్తించవలసిన విదమునకు విరుద్ధముగా వర్తించు చుండును. అది నిజముగా ధర్మము కానటువంటి వానిని ధర్మములుగా అంగీకరించి నిజమైన ధర్మమును నిరసించు చుండును. అట్టి తమోగుణపూరితులు మహాత్ముడైన వానిని సామాన్య మానవునిగా, సామాన్య మానవుని మహాత్మునిగా అంగీకరింతురు. వారు సత్యమును అసత్యముగా భావించుచు, అసత్యమును సత్యముగా ఆమోదింతురు. కర్మలన్నింటి యందును వారు తప్పు మార్గమునే అనుసరింతురు. కనుకనే వారి బుద్ధి తమోగుణముతో కూడియుండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement