Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 26
26.
ముక్తసంగోనహంవాదీ
ధృత్యుత్సాహసమన్విత: |
సిద్ధ్యసిద్ద్యోర్నిర్వికార:
కర్తా సాత్త్విక ఉచ్యతే ||

తాత్పర్యము : తిగుణ సంగత్వరహితముగా మిథ్యాహంకారము లేకుండా నిశ్చయము మరియు ఉత్సాహమును గూడి, జయాపజయములందు నిర్వికారుడై తన ధర్మమును నిర్వర్తించువాడు సాత్తిక్వ కర్తయనబడును.

భాష్యము : కృష్ణ చైతన్యముతో నుండు వ్యక్తి ఎల్లప్పుడూ త్రిగుణములకు అతీతముగా ఉండును. గర్వము, అహంకారము లేని కారణముగా తన కిచ్చిన పని నుండి వచ్చు ఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉండడు. అంతేకాక పనిని ముగించే వరకూ ఉత్సాహముతో కొనసాగును. పనిలో విజయమైనా, విఫలమైనా, కష్టము వచ్చినా సుఖము వచ్చినా సమ భావనతో ముందుకు కొనసాగుతాడు. అట్టి కార్య దక్షుడు సత్వగుణములో ఉన్నట్లు లెక్క.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement