అధ్యాయం 18, శ్లోకం 25
25.
అనుబందం క్షయం హింసామ్
అనవేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ
యత్తత్ తామసముచ్యతే ||
తాత్పర్యము : శాస్త్ర నిర్దేశములను నిరసించి భవిష్యత్బంధమును గాని, పరహింసను, పరదు:ఖమును గాని లెక్క పెట్టక భ్రాంతియందు ఒనర్చబడు కర్మము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.
భాష్యము : ప్రతి వ్యక్తీ తాను చేసిన కార్యములకు కోర్టుముందు గాని భగవంతుని ప్రతినిధులైన యమదూతలకు గానీ లెక్క చెప్పవలసి ఉంటుంది. వేదాలలో తెలుపబడిన విధులను ఉల్లంఘించి చేయు బాధ్యతా రహిత కారములన్నీ వినాశమునకే దారి తీయును. అటువంటి కార్యములు హింసను పురి కొల్చుటే కాక వేరే వారికి కూడా బాధలను కలిగించును. తన జీవితములో జరిగిన అనుభవాలకు ప్రతిచర్యగా ఇటువం టి బాధ్యతా రహిత కార్యములు చేయబడును. దీనినే భ్రాంతి అందురు. భ్రాంతితో చేయు అటువంటి కార్యములు తమో గుణమునకు సంబంధించినవిగా చెప్పవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..