Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 21
21.
పృథక్త్వేన తు యద్‌జ్ఞానం
నానాభావాన్‌ పృథగ్విధాన్‌ |
వేత్తి సర్వేషు భూతేషు
తద్‌జ్ఞానం విద్ధి రాజసమ్‌ ||

తాత్పర్యము : ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మనుజుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీవెరుగుము.

భాష్యము : శరీరమే ఆత్మయని, చైతన్యమునకు కారణమైన ఆత్మ అంటూ ప్రత్యేకముగా ఏమీ లేదని భావించుట రజోగుణము నందలి జ్ఞానమనబడును. అనగా వేరు వేరు వ్యక్తుల మధ్య భేదము కేవలము చైతన్యములోని ఎదుగుదల మీదనే ఆధారపడి ఉంటుందని అటువంటి చైతన్యము తాత్కాలికమని మార్పు చెందుతూ ఉంటుందని బావిస్తూ ఉంటారు. అంతేకాక జ్ఞానమయమైన ఆత్మ ఒక్కటే సర్వత్రా వ్యాపించి ఉంటుందని వేరు వేరు ఆత్మలు ఉండవని ఈ శరీరము అజ్ఞానము వలన తాత్కాలికముగా ఏర్పడినదని భావించుదురు. ఇలాంటి ఊహాజనిత కుతర్కవాదనలు రజోగుణ ప్రభావము వలన వచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement