అధ్యాయం 18, శ్లోకం 12
12.
అనిష్టమిష్టం మిశ్రం చ
త్రివిధం కర్మణ: ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య
న తు సన్న్యాసినాం క్వచిత్ ||
తాత్పర్యము : ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్టమిశ్రితము అనెడి మూడు విధములైన కర్మఫలములు త్యాగికానటువంటి వానికి మరణము పిదప కలుగుచున్నది. కాని సన్యాసాశ్రమునందున్న వారికి మాత్రము సుఖదు:ఖములను కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు.
భాష్యము : శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణ భక్తి రసభావితుడు సర్వదా ముక్తస్థితి యందే యుండును. కనుక అతడు మరణము పిదప తన కర్మఫలములచే సుఖించుట గాని, దు:ఖించుట గాని జరుగదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..