Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 25
25.
తదిత్యనభిసంధాయ
ఫలం యజ్ఞతప:క్రియా: |
దానక్రియాశ్చ వివిధా:
క్రియంతే మోక్షకాంక్షిభి: ||

తాత్పర్యము : ఫలాపేక్షరహితముగా ప్రతివారును యజ్ఞము, తపస్సు, దానములను ”తత్‌’ అను పదమును గూడి ఒనరింపవలెను. భౌతిక బంధనము నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మిక క ర్మల ముఖ్య ప్రయోజనము.

భాష్యము : కేవలము భౌతిక లాభము కొరకు మాత్రమే పని చేసినట్లయితే అది వ్యక్తిని ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుటకు సహాయపడదు. కాబట్టి భగవద్ధామమునకు చేరవలెననే లక్ష్యంతోనే ప్రతి కార్యమూ చేయవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement