అధ్యాయం 17, శ్లోకం 19
19.
మూడగ్రాహేణాత్మనో యత్
పీడయా క్రియతే తప: |
పరస్యోత్సాదనార్థం వా
తత్తామసముదాహృతమ్ ||
తాత్పర్యము : తనను తాను హింసించుకొనుటచే గాని, ఇతరులకు హాని లేదా నష్టమును గూర్చునిమిత్తముచే గాని మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించుఒనదని చెప్పబడును.
భాష్యము : హిిరణ్య కశిపుడు దేవతలను అంతమొందించుటకు ఘోర తప స్సులను చేసెను. బ్రహ్మను ప్రార్థించి అనేక వరములను పొందెను. చివరకు భగవంతునిచే సంహరింపబడెను. ఇలా ఎన్నో ఉదాహరణలను మనము చూడవచ్చును. అసాధ్యమైన దాని గురించి తపస్సు చేయుట తమోగుణమే కాగలదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..