Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 10
10.
యాతయామం గతరసం
పూతి పర్యుషితం చ యత్‌ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం
భోజనం తామసప్రియమ్‌ ||

తాత్పర్యము :భుజించుటకు మూడు గంటలకు ముందు తయారు చేయబడినవి, రుచి రహితములైనవి, చెడిపోయినవి మరియు క్రుళ్ళినవి, ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములఉ కలిగినట్టివియైన ఆహారములు తమోగుణులకు ప్రియమైనవి.

భాష్యము : తాజాగా ఉండని ఆహారము తమోగుణము క్రిందకు వస్తుంది. అది తామసులకు ప్రియమే అయినా సత్వ గునములో ఉండువారు సహించలేరు. ఆహారములన్నింటిలోకీ శ్రేష్ఠమైనది. భగవంతునికి అర్పించిన ప్సాదము. భగవంతుడు మనలోని భక్తిని ప్రేమనే చూస్తాడని చెప్పి వేటిని బడితే వాటిని అర్పించరాదు. స్వయముగా భగవద్గీతలో శ్రీ కృష్ణుడు పత్రం, పుష్పం, ఫలం, తోయమని కొన్ని ఆహారాలని తెలిపి ఉన్నాడు. వాటిని అర్పించినట్లయితే భగవంతుడు స్వీకరిస్తాడు. అట్టి ప్రసాదము ఎప్పటికైనా స్వీకరించవచ్చును. త్రిగుణముల నుండి విముక్తి పొందుటకు ప్సాదమును స్వీకరించుటయే మార్గము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement