Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 1
ఓం శ్రీ పరామాత్మనే నమ:

అథ సప్తదశోధ్యాయ:
శ్రద్ధాత్రయవిభాగయోగ:

1.
అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య
యజంతే శ్రద్ధయాన్వితా: |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ
సత్త్వమాహో రజస్తమ: ||

తాత్పర్యము : అర్జునుడు ప్రశ్నించెను : ఓ కృష్ణా! శాస్త్రనియమములను పాటింపక తమ ఆనసిక కల్పనలను అనుసరించి పూజలు ఒనర్చువారి స్థితి యెట్టది? వారు సత్త్వ గుణులా, రజోగుణులా లేక తమోగుణులా?

భాష్యము : గత అధ్యాయములో శాస్త్ర నియమములను పాటించువారు దేవతలని, శాస్త్ర నియమములను పాటించనివారు అసురులని నిర్ధారింపబడ్డారు. మరి ఈ రెండు తరగతులకు చెందని వారు, అనగా శాస్త్రములలో తెలియజేయని నియమాలను పాటించు వారి పరిస్థితి ఏమి? అని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. వారికి నచ్చిన ఏదో ఒక మానవుడినే దేవునిగా పూజించే వారి శ్రద్ధ సత్వ రజస్తమో గుణములలో ఏ కోవకు చెందుతుంది? వారు కూడా ఉన్నత స్థితికి ఎదిగి జీవితాన్ని సార్థకము చేసుకోగలుగుతారా? ఇలా శాస్త్ర నియమాలను పాటించక తమ ఇష్టానుసారము ఏ దేవతనో, మావున్నో ఏదో ఒక దానికి విశ్వాసముతో పూజించినట్లయితే వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయా? అని అర్జునుడు కృష్ణున్ని ప్రశ్నించుచున్నాడు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement