Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 8
8.
ఆయు: సత్త్వబలారోగ్య –
సుఖప్రతీవివర్థనా: |
రస్యా: స్నిగ్ధా: స్థిరా హృద్యా:
ఆహారా: సాత్త్వికప్రియా: ||

తాత్పర్యము : ఆయు: ప్రమాణమును పెంచునవి, జీవనమును పవిత్రమొనర్చునవి, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, తృప్తిని కలిగించునవి అగు ఆహారములు సత్త్వ గుణ ప్రధానులకు ప్రియమైనవి. అట్టి ఆహారములు రసపూర్ణములు, పుష్టికరములును, మనో ప్రీతికరములును అయి యుండును.

భాష్యము : ఆహారము యొక్క లక్ష్యము జీవిత కాలమును వృద్ధి చేయుట, మనస్సును పవిత్రీకరించుట మరియు శరీరమునకు పుష్టిని ఇచ్చుట. కాబట్టి మన పూర్వీకులు ఋషులు ఆరోగ్యాన్ని, ఆయుష్షున్ని పెంచే పదార్థాలైన పాల ఉత్పత్తులు, ధ్యానములు, కూరగాయలు, ఫలములు మరియు తీపి పదార్థాలను ఎంచుకున్నారు. ఇవన్నీ సత్వ గుణములో నున్న వారికి ఆకర్షణీయమగును. అటుకులు, పలాలు మరియు పటిక బెల్లము వంటివి పాల పదార్థాలతో కలిసినప్పుడు సత్వగుణాన్ని సంతరించుకుంటాయి. పైన పేర్కొనబడిన క్రొవ్వు పదార్థములు మాంసాహారము కాదు. జంతువుల యొక్క క్రొవ్వు పదార్థములు పాల ద్వారా లభిస్తాయి. ధాన్యముల ద్వారా ప్రోటీనులు లభిస్తాయి. కాబట్టి మాంసాహారము కొరకు జంతువులను వధించుట క్రూరత్వమే కాగలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement