Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 23
23.
య: శాస్త్రవిధిముత్సృజ్య
వర్తతే కామకారత: |
న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాం గతిమ్‌ ||

తాత్పర్యము : శాస్త్రవిధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని, సుఖమును గాని, పరమగతిని గాని పొందజాలడు.

భాష్యము : శాస్త్రములు ఎంతో కరుణతో మనవ జీవిత లక్ష్యమైన భగవద్భక్తిని బోధింఉచున్నవి. గత శ్లోకములో తెలుసుకున్నట్లు వర్ణ మరియు ఆశ్రమ ధర్మాలను నిర్వహించినట్లయితే ఆత్మ సాక్షాత్కారము పొంది క్రమేణ భగవద్భక్తి స్థితికి చేరుకొనవచ్చును. ఎవరైతే కామ క్రోధ లోభములకు బానిసలై శాస్త్రనియమములను త్రోసి పుచ్చి ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించెదరో వారు జీవితాన్ని వ్యర్థము చేసుకున్నవారవుతారు. శాస్త్ర నియమములను తెలిసి కూడా నిర్లక్ష్యము చేయువారు మానవులలో అధములుగా పరిగణించబడతారు. కాబట్టి మానవ జన్మలో శాస్త్ర నియమ నిబంధనలు పాటించి జీవిత పవిత్రీకరణ చేసుకోనట్లయితే వారు ఆనందమును పొందలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement