Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 19
19.
తానహం ద్విషత: క్రూరాన్‌
సంసారేషు నరాధమాన్‌ |
క్షిపామ్యజస్రమశుభాన్‌
ఆసురీష్వేవ యోనిషు ||

తాత్పర్యము : అసూయగలవారును, క్రూరులను అగు నరాధములను వివిధ అసురజ న్మలనెడి సంసారసాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను.

భాష్యము : ఈ శ్లోకము నందు మనము వచ్చే జన్మలో ఏ శరీరము పొందుతామనేది దైవ నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది కాని మన కోరిక మీద ఆధారపడి ఉండదని స్పష్టము చేయబడినది. అసురులు భగవంతుడు లేడని తమ ఇష్టానుసారము పజీవించవచ్చని భావించినా వచ్చే జన్మను వారు నిర్ణయింపలేరు. ఈ శరీరమును వదలిన తరువాత ఆత్మ దైవ అధ్యక్షతన వేరే తల్లి గర్భమున ప్రవేశపెట్టబడుతుందని శ్రీమద్భాగవతమున కూడా తెలియజేయబడినది. మానవ జన్మే కాక వేరే జన్మ కూడా వచ్చే అవకాశము ఉన్నది. అందువలన మనము పశుపక్ష్యాదులు, క్రిమి కీటకముల వంటి అనేక జీవరాశులను చూస్తూ ఉంటాము. ఎవరు ఏ జన్మ తీసుకుంటారనేది దైవ నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. అసురులు మళ్ళీ మళ్ళీ అసురుల జన్మలను పొందుచూ కామ, క్రోధ, ద్వేషాలను పెంపొందించుకొనుచూ నరాధములుగా కొనసాగుచూ ఉందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement