Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 17
17.
ఆత్మసంభావితా: స్తబ్ధా:
ధనమానమదాన్వితా: |
యజంతే నామయజ్ఞైస్తే
దంభేనావిధిపూర్వకమ్‌ ||

తాత్పర్యము : ధనము మరియు మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించుచు, సదా గర్వితులై వారు కొన్నిమార్లు విధి, నియమములను పాటింపకనే దంభముతో నామకార్థము యజ్ఞములను ఒనరింతురు.

భాష్యము : అసురులు తాము సర్వ స్వతంత్రులమని భావించి ఎవరి మాటా వినరు. ధనము పలుకబడి వలన వచ్చిన గర్వముతో పరుషముగా ప్రవర్తించెదరు. వారు అందరి శ్రేయోభిలాషులవలె, భగవంతుని అవతారము వలె బోధనలు చేయుచూ సామాన్యులను తప్పుద్రోవ పట్టించుదురు. పలుకబడి కోసము యజ్ఞాలను నిర్వహించటము గాని, దేవతలను పూజించుట గాని, లేదంటే కొత్త భగవంతున్ని సృష్టించటము గానీ చేయుచుందురు. మరి కొందరు కాషాయ దుస్తులను స్వీకరించి దానికి పాటించవలసిన నియమ నిబంధనలను నిర్లక్ష్యము చేయుదురు. అజ్ఞానము, మోహము వలన ఇలాంటి వాటికి పాల్పడుచుందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement