Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 34
34.
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానసి యోధవీరాన్‌ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్య జేతాసి రణే సపన్నాత్‌ ||

తాత్పర్యము : ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇది వర కే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.

భాష్యము : భగవంతుడే అన్ని ప్రణాళికలను చేస్తాడు. అయితే వాటిని తన భక్తుల ద్వారా అమలు పరచి వారికి కీర్తిని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు ద్వారా కృష్ణుని ప్రణాళికలను తెలుసుకొని దానిని అమలు పరిచే విధముగా జీవితాన్ని మలచుకున్నట్లయితే కృష్ణ చైతన్యవంతులు కాగలుగుతారు. ఎందువలన నంటే శుద్ధ భక్తుల కోరికలు భగవంతుని కోరికలతో సమానమే. అటువంటి వాటిని మనము అమలుపరచి జీవన పోరాటములో విజయమును సాధించవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement