అధ్యాయం 1, శ్లోకం 24
24
సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో
గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్ ||
తాత్పర్యము : సంజయుడు పలికెను : ఓ భరత వంశీయుడా ! అర్జునునిచే ఆ విధంగా సంభోధింపబడిన వాడై శ్రీ కృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.
భాష్యము : ఈ శ్లోకమునందు అర్జునుడు ”గుడాకేశ”అనగా అజ్ఞానమును, నిద్రను జయించినవాడని తెలుపబడెను. అర్జునుడు శ్రీ కృష్ణుని స్నేహము వలన సదా కృష్ణున్నే స్మరిస్తూ ఉండెడివాడు. అందువలన అజ్ఞానమును, నిద్రను జయించగలిగెను. ఇలా భక్తుడు సదా భగవంతుని నామ, రూప, గుణాలను స్మరించుట ద్వారా గుడాకేశుడు కాగలడు. అలాగే కృష్ణుడు హృషీకేశునిగా అన్ని జీవరాశుల ఇంద్రియాలు, మనస్సును నియంత్రించువాడు కాబట్టి అర్జునుని మనోగతమును అర్థము చేసుకొనెను. రధాన్ని ఇరుసేనల మధ్య నిలిపి, ఇలా పలికెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..