Thursday, September 19, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 10

10.
మయాధ్యక్షేణ ప్రకృతి:
సూయతే సచరాచరమ్‌ |
హూతునానేన కౌంతేయ
జగద్విపరివర్తతే ||

తాత్పర్యము : ఓం కౌంతేయా! నా శక్తులలో ఓకటైన భౌతికప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది.

భాష్యము : ఈ భౌతిక సృష్టి భగవంతుని ఇచ్చానుసారము గనే సృష్టించబడినది. అయితే భౌతిక ప్రకృతి ఈ జగత్తును నడిపిస్తూ ఉంటుంది. ఆ విధముగా భగవంతుడు ఈ జగత్తును జరిగే కార్యములకు అతీతుడుగా ఉంటాడు. వేర్వేరు జీవరాశులు వారి పూర్వ పాపపుణ్యములను బట్టి జన్మలను పొందుతూ ఉంటారు. అయితే భగవంతుని అధ్యక్షత లోపిస్తే భౌతిక ప్రకృతి తానంతట తానుగా ఏమి చేయలేదు. భగవంతుడు మాత్రము భౌతిక కార్యముల పట్ల ఎటువంటి ఆసక్తిని కలిగి ఉండడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
————-

Advertisement

తాజా వార్తలు

Advertisement