– మధ్యాహ్నం 2.18 గంటలకు జలప్రవేశం
– ఆరుగంటల పాటు సాగిన శోభాయాత్ర
– భారీ కాయుడ్ని చూసేందుకు తరలివచ్చిన నగర ప్రజలు
– దారిపొడువునా మహాగణపతిని దర్శించుకున్న ప్రజలు
– సెల్ఫీలు దిగుతూ సందడి చేసిన యువత
అమీర్‌పేట : శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా తొమ్మిది రోజులు భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ తల్లి ఒడికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర రాజ్‌దూత్ కాలనీ, -టె-లిఫోన్ భవన్, తెలుగుతల్లి ప్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు ఆరు గంటలపాటు- సాగింది. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్ల నడుమ సందడిగా సాగింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనాన్ని చూడటానికి నగరం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పంచముఖ రుద్ర గణపతి రూపంలో కొలువుదీరిన గణేశుని శోభాయాత్ర దారి పొడుగునా భక్తులు దర్శించుకుని తన్మయత్వంతో మునిగిపోయారు. తెలుగుతల్లి ప్లైఓవర్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న తర్వాత మహాగణపతికి గంటపాటు- పూజలు చేశారు. అనంతరం మధాహ్నం 2.18 గంటలకు నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్-4 వద్ద మహా గణపతిని జలప్రవేశం చేయించారు. దీంతో భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జన ఘట్టం ముగిసింది.
వచ్చేఏడాది మట్టి గణపతి :
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ- నిర్ణయించింది. 70అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించి అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు- కమిటీ- ప్రతినిధులు ప్రకటించారు. ఏటా ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా 40 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్ వల్ల గతేడాది ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినప్పటికీ ఈసారి భారీగా ఏర్పాట్లు- చేశారు.
విభిన్నమైన రీతిలో..
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్కడున్నా తన స్టైలే వేరు. విభిన్నమైన రీతిలో వినాయకుడిని ఊరేగించి అందరి దృష్టిని ఆకర్శించారు. ఆర్టీసీ బస్సులో కూర్చుని కుటు-ంబసభ్యుల సందడి మధ్య వినాయక విగ్రహాన్ని ఒడిలో పెట్టు-కొని నిమజ్జనానికి తీసుకెళ్లారు. నిమజ్జనం చేయడానికి ప్రత్యేక వాహనాల్లో కాకుండా సగటు ప్రయాణికునిలా బస్సులో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో కుటు-ంబీకులు పాటలు పాడుతూ సందడి చేశారు. ఏ విభాగంలో పనిచేసినా సజ్జనార్ తన ప్రత్యేకతను చాటుకుంటారు.
బోటు నడుపుతూ.. పర్యవేక్షిస్తూ..
హుస్సేన్ సాగర్‌లో స్వయంగా బోటు నడిపి అందరిని ఆకర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఉదయం నగరంలోని పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు- చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. కెమెరాల ద్వారా గణేష్ ప్రతిమల శోభాయాత్ర, నిమజ్జనంను పర్యవేక్షించారు. అనంతరం గార్డెన్ రోడ్‌లో పర్యటించి ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనంచేసే క్రేన్ నెంబర్-4 వద్ద ఏర్పాట్లను పరిశీలించి అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం మంత్రి స్వయంగా బోట్ నడుపుతూ హుస్సేన్ సాగర్‌లో పర్యటిస్తూ విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించారు.