సంతోషంగా, స్వతంత్య్రంగా, ప్రశాంతంగా ఉంటూ నీ జీవితంలో అర్థవంతమైన, స్పష్టమైన భగవంతుని సహవాసాన్ని తీసుకు రావచ్చు. నీకున్న ఉన్నతోన్నత ఆదర్శాలను చేరుకోవడానికి ఇది చాలా చక్కటి సమయము.
సంరక్షణ :-
మన శత్రువు గురించి మనకు తెలియకపోతే ఆ శత్రువు నుండి సంరక్షించుకోవడము కూడా మనకు తెలియదు. కోపము, లోభము, అహంకారము, కామము, మోహము మనలో మరియు ఇతరులలో ఉన్న శత్రువులు. మనల్ని మనం రక్షించుకోలేక పోతే ఇంకెవరు రక్షిస్తారు?సంకల్పాల విలువను అర్థం చేసుకోకుండా, జీవితంలో ఎటువంటి గమ్యము లేకుండా ఉండటము అజ్ఞానము. ఇది మరో రకమైన శత్రువు. చెప్పాలంటే అన్నీ బాగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి అవి అంటే మనలోని అజ్ఞానాన్ని ఇంకా మనం గుర్తించలేదు, మనకు రక్షణ అవసరము అని కూడా గుర్తించలేము అని అర్థం. వికారాలను గెలవాలన్న మన సంకల్పమే మనం చేసే అహింసా యుద్ధము. సుగుణము, విజ్ఞానముతో కూడిన ఆధ్యాత్మికత నీ జీవితానికి కత్తి వంటిది. అదే మనకు సంరక్షణ.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి