Tuesday, November 26, 2024

కోర్కెలు తీరడానికి శివాభిషేకం…

ఈసంసార సాగరాన్ని దాటి తరించడానికి శివాభిషేకాన్ని/ లింగార్చనను మించిన మార్గం మరొకటి లేదు. అజ్ఞానమనే చీకటి నుండి వ్యసనాల నుంచి విముక్తి లభించాలన్నా శివాభిషేకం మాత్రమే శరణ్యం. విద్యాభివృద్ధికి 1000, పుత్రార్థులు 1500, భూత, ప్రేత, పిశాచాది బాధా నివారణార్థం 500, దారిద్య్రం పోవడానికి 3000, సర్వకామ్యార్థ సిద్ధికి 10వేలు లింగాలను అర్చించాలి. లేదా అన్నిసార్లు శివాభిషే కాలు చేయాలి. లేదా చేయించుకోవాలి. నిత్యం ఆరాధించేవారు ఒక పార్థివలింగానికి అర్చన చేసినా తమ పాపాల నుండి విముక్తులవుతారు. భస్మం, రుద్రాక్ష, మారేడు దళాలు ఈ మూడింటినీ శివ పూజకు తప్పనిసరిగా ఉప యోగించాలి. బిల్వవృక్షం శివస్వరూపంగా భావిస్తారు. ఆ వృక్షాన్ని గంధపుష్పాదు లతో పూజించడంతోపాటు, ఆవృక్షం చుట్టూ దీపాలు పెట్టిన వారికి శివజ్ఞానం సిద్ధిస్తుందని భావిస్తారు. ఆ చెట్టు మొదలులో ఒక శివభక్తునకు క్షీరాన్నం సమర్పించినవారికి ఏ జన్మలోనూ దరిద్రం సంభవించదని భావిస్తారు. ఈవిధంగా శివారాధన అయిన తరువాత భక్తితో లింగా లను విసర్జించడం మరచిపోకూడదు. శివాభిషేకం లేదా లింగార్చన జరిగేచోట కూర్చుని చేసే విధానాన్ని చూసినా, మహన్యాస, నమక చమక రుద్ర మంత్రాలు విన్నా అభిషేకం చేసేవారు పూజాప్రదేశం నుంచి లేవకుండా వారికి తగిన పూ జాద్రవ్యాలు అందించినా చాలా పుణ్యం లభిస్తుందని శివపు రాణ ఉవాచ. శివాభిషేకం జలం తొక్కరాదు. ఆ జలాన్ని బిల్వవృక్షం మొదట్లో పోస్తే చాలామంచిది. శివాభిషేక జలాన్ని శివపంచాక్షరీ మంత్రం జపిస్తూ ఇంటి నాలుగు ప్రక్కలా జల్లి తే ఎటువంటి నరఘోష, మృత్యుభయం వుండదు. ఇంటి పరిసరాల్లోని బావిలో కాని, బోర్‌వెల్‌ లోపలికిగాని శివాభిషేక జలాన్ని పోస్తే నీరు సమృద్ధిగా సర్వకాలాల్లో లభిస్తూనే వుంటుంది.
– చివుకుల రాఘవేంద్రశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement