Friday, November 22, 2024

కొద్దిపాటి కోపము కూడా చెడు కర్మల క్రిందకే లెక్క

వివిధ దేశాల ప్ర భుత్వాలు కేవలం ఉగ్ర రూపం దాల్చిన కోపానికి మాత్రమే దండన విధిస్తున్నారు. – కోపావేశాలకు గురై ఒక వ్యక్తిని చంపినా లేక చంపడానికి ఏదైనా ఆయుధాన్ని ఉపయోగించినా వారు మాత్రమే శిక్షార్హులవుతున్నారు. కేవలం ఉగ్రరూపం దాల్చిన కోపానికి మాత్రమే కాక కొద్ది పాటిగా కోపం కూడా శిక్షార్హమే అని ప్రభుత్వం గనుక కొత్త చట్టం తీసుకు వస్తే ఆ చట్టాన్ని అమలు చెయ్యడానికి అంటే న్యాయధికారులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఎవ్వరూ మిగిలి ఉండరు. నిజానికి అందరూ కోపానికి ఏదో ఒక మోతాదులో లోనవుతూనే ఉంటారు. కేవలం శిక్షలకు అతీతమని, ప్రభుత్వ శిక్షా స్మృతిలో లేని కారణంగా కొద్దిపాటి కోపానికి లోనై చేసే కర్మలను చెడు కర్మల కింద జమ చెయ్యకుండా ఉండకూడదు. సర్వోత్తముడైన పరమాత్ముని దర్బారులో అతి స్వల్ప కోపము కూడా క్రోధిని శిక్షార్హుడిగా చేస్తుంది. నిజానికి, కోపం వచ్చిన ఆక్షణం కూడా క్రోధి అశాంతితో శిక్షను అనుభవిస్తున్నట్లే. కోపము, కొద్దిగా అయినా, ఎక్కువైనా, అది ఎప్పుడూ హానికరమైనదే. కనుక, మనిషి శాంతంగా, మధురంగా, మౌనంగా ఉండటం నేర్చుకోవాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement