న్యూఢిల్లి: వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం కాశీకి వస్తోంది. ఈ విగ్రహా న్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అందజేశారు. ఢిల్లిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించారు. అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా నుంచి తెప్పిస్తున్న ట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతేడాది నవంబరు లో ‘మన్ కీ బాత్’ సందర్భంగా వెల్లడించారు. ఈ విగ్రహం కెనడాలోని మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో ఉంది. నోర్మన్ మెకంజీ వారసత్వంగా దీనిని ఈ గ్యాలరీలో ఉంచారు. 2019లో దివ్య మెహ్రా అనే ఆర్టిస్టు మెకంజీ గ్యాలరీలో తన ఎగ్జిబిషన్ కోసం సిద్ధమవుతూ ఈ విగ్రహాన్ని చూశారు. తర్వాత రికార్డులను పరిశీలించ గా.. వారణాసి ఆలయం నుంచి చోరీకి గురైన విగ్ర#హంగా గుర్తించారు. 1913లో మెకంజీ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని చూశారట. ఆయన కోరిక మేరకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆలయం నుంచి దీనిని అపహరించి అతడికి ఇచ్చినట్లు రికార్డు లు చెబుతున్నాయి. దీని గురించి తెలియగానే దివ్య మెహ్రా.. మెకంజీ ఆర్ట్ గ్యాలరీ సీఈవోతో మాట్లాడి విగ్రహాన్ని భారత్‌కు అప్పగించాలని కోరారు. ఆ తర్వాత ఒట్టావాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు కూడా దీనిపై కెనడా ప్రభుత్వంతో చర్చించగా.. విగ్రహాన్ని తిరిగిచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది.
15న విగ్రహ ప్రతిష్ఠ
నాలుగు రోజుల పాటు శోభాయాత్ర నిర్వహంచి నవంబరు 15న కాశీలో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నా రు. గురువారం ప్రత్యేక రథంలో ఈ విగ్రహాన్ని దిల్లి నుంచి అలీగఢ్ తీసుకెళ్లారు. నవంబరు 12న కనౌజ్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అయోధ్య వరకు శోభా యాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబరు 15న వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారు లు వెల్లడించారు.
కాశీకి అన్నపూర్ణ విగ్రహం
Advertisement
తాజా వార్తలు
Advertisement