శ్రీశైలం, ప్రభన్యూస్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల లో ఏడో రోజైన బుధవారం కాలరాత్రి అలంకరణలో భ్రమరాంబికా దేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామి అమ్మవార్లను గజవాహనంపై ఊరేగి ంచారు ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజు న సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపం లో. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న. అర్చకులు వేద పండితులు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఎస్ లవన్న, ఏఈఓలు హరి దాసు. ఫణింద్ర ప్రసాద్, పర్యవేక్షకులు అయ్యన్న, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్, పీఆర్‌ఓ శ్రీనివాసులు, శ్రీశైల భద్రతాధికారి నరసింహారెడ్డి. పోలీస్ అధికారులు ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా కుమారి పూజ
శ్రీశైలమహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రతి రోజూ కుమారి పూజ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికను పూలు, పండ్లు నూతన వస్త్రాలు సమర్పించి పూజిస్తున్నారు.
కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి
Advertisement
తాజా వార్తలు
Advertisement