Tuesday, November 26, 2024

కాలినడక భక్తులకు విశ్రాంతి షెల్టర్లు

తిరుపతి, ప్రభ న్యూస్‌ : చెన్నై నగరంతో పాటు- పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచి వచ్చే భక్తుల సౌక ర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరానికి వసతి షెల్టర్లు నిర్మిస్తామని టీ-టీ-డీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చెన్నై టీ- నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో స్థానిక సలహామండలి చైర్మ న్‌గా శేఖర్‌ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశా రు. సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, శేఖర్‌ రెడ్డి తిరుమల శ్రీవారి పరమ భక్తుడని, హిందూ ధర్మ ప్రచారం కోసం ఆయన ఇతో ధిక సహాయం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది పెరటాసి మాసం ప్రారంభమయ్యే లోపు కాలినడకన వచ్చే భక్తుల సదుపాయం కోసం షెల్టర్లు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
చెన్నైలో నిర్మిస్తున్న శ్రీ పద్మా వతి అమ్మవారి ఆలయం ఏడాదిలోపు పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని చైర్మన్‌ తెలిపారు. తిరుమల తరహా లో చెన్నై నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓఎంఆర్‌, ఈసిఆర్‌ ప్రాంతాల్లో భూమి ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి, పనులు ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి వివరించారు. ఈ నెల 11న ఎస్‌వీబీసీ హిందీ, కన్నడ ఛానళ్ళను ముఖ్య మంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, బసవ రాజ్‌ బొమ్మై ప్రారంభిస్తారన్నారు. అలిపిరి వద్ద శేఖర్‌ రెడ్డి నిర్మించిన గో మందిరాన్ని అదే రోజు ముఖ్య మంత్రి జగన్‌ ప్రారంభిస్తారని తెలిపారు.
కోవిడ్‌ నిబం ధనల మేరకే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్య లో భక్తులను అనుమతి స్తున్నామన్నారు. శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అలిపి రిలో గోమం దిరం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక్కడ గో తులా భారం కూడా ఏర్పాటు- చేసినట్లు- ఆయన తెలిపారు. స్వామి వారు ఇది తనకు ఇచ్చిన భాగ్యమని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీ-టీ-డీ పాలకమం డలి సభ్యులు శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement