తిరుమల ప్రభన్యూస్ : కార్తీకమాసం సందర్భంగా ఈనెల 22 వ తేది బెంగుళూరులో టిటిడి నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టిటిడి చైర్మెన్ వైవి.సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మైని ఆహ్వానించారు. తప్పకుండా హాజరవుతానని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం టిటిడి చైర్మెన్ కర్ణాటక ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగా అల్పాహారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి టిటిడి ధార్మిక కార్యక్రమాల గురించి అడిగారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మించామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా ఈనెల 19 వ తేది తిరుపతి, 22 వ తేది బెం గుళూరు, 29 వ తేది విశాఖపట్నంలో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్ర మాలు నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా గత నెల 12వ తేదిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఎస్వీబీసీ కన్నడ ఛానల్‌ను ప్రారంభించామని చైర్మన్ తెలిపారు.ఈ ప్రసారాలకు భక్తులనుంచి విశేష ఆధరణ లభిస్తోందని కన్నడ చానల్‌లో దాస సాహిత్య కార్య క్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని , ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొం దించాలని ముఖ్యమంత్రి టీటీడీ చైర్మన్‌ను కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూ లంగా స్పందించారు. టీటీడీ చేపట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి అభినందించారు.ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. టీటీడీ పాలక మండలి సభ్యులు శశిధర్, విశ్వనాథరెడ్డితో పాటు పలువురు కర్ణాటక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement