Monday, November 25, 2024

కాకి నేర్పే అద్వైతం!

ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, ”మహాల యంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడ తాము? మన పూర్వీకులు కాకులుగా మారా రా? అయితే ఇంత టి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వామివారు ఒకసారి చిరునవ్వు నవ్వి, ”తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్‌’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.”
”క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కాకా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగిన ట్టు! కాకులు విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకిని నువ్వు అల్పపక్షి అంటు న్నావు. కాకి ఎంత గొప్పదో చెబుతాను విను….!” అంటూ చె ప్పడం ప్రారంభించారు.
”అది బ్రహ్మ ముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయ మైన బ్రహ్మ ముహూర్తం లో నిన్ను నిద్ర లేపుతుంది. అది పూజకు సరైన నిర్దేశం. అంతేకాక, దానికి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ‘ఆహారా న్ని పంచుకుని తినండి’ అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేక లక్షణం కాకిలో కలిగినది.
మరలా సాయంత్రం నిద్రకు ఉపక్ర మించే ముందు, మరలా కాకా అని అంటుం ది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగ వంతునికి కృతజ్ఞతగా! అలా గే, కాకులు సూర్యా స్తమయం తరు వాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా. ఇదిఎంతమంది పాటిస్తు న్నారు? కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందు కే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు. మరొక్క విషయం… కేవలం మహాల యంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు. కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది. నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషప డి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్‌ స్వరూపులే!” అని తెలిపారు. ఇది వినగానే ఆ భక్తుడు, అక్కడున్న వారందరూ స్వామి వారికి నమస్కారం చేసి, అందరూ ఒక్కసారిగా ”జయ జయ శంకర, హర హర శంకర” అని పెద్దగా పలికారు. పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేష ణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సు లను పొందుదాము.
– డా|| చదలవాడ హరిబాబు,9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement