ఆంధ్ర వాజ్ఞయ సాహిత్యంలో పేరెన్నికగన్నది శతక పద్యాలు. శతకములలో ఆణిముత్యమనదగినది సహజ కవి మహనీయుడు బమ్మెర పోతనామాత్యుల వారు రచించినది. జగతిలో ప్రసిద్ది గాంచినది శ్రీ నారాయణ శతకం. ఈ శతక పద్యాలు ప్రౌఢముగా ఉండవు. ఈ శతకంలో ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్య సాహిత్య వ్యాకరణంశములతో, చందో నియమములతో విరాజిల్లిన దమటలో సందియము లేదు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మన్నారాయణు ఓ వైకుంఠ వాసుడు. నారాయణుని నామమునకు శ్రీ జేర్చి రచించిన దీ శతకం. భాషా సాహిత్యములకేగాక, తాత్విక విషయముల కిచ్చిన ప్రాధాన్యత ప్రశంసనీయం. శ్రీ నారాయణుని దివ్య మహిమలనూ, భక్తినీ ముక్తినీ, వైరాగ్యమును ప్రసాదించే పురాణ పురుషునిగా శతక పద్యా లలో తీర్చిదిద్దుట సకల జనుల పూర్వ జన్మ పుణ్య పరిపాకమే. నారాయణుని కళ్యాణ గుణాలు ఇందులో మనోజ్ఞంగా వర్ణింప బడినవి. ఆ శ్రిత జన మందారుడైన శ్రీ నారాయణ శతకంలోని ఒక అణిముత్యంగా పేర్కొనదగిన ఒక పద్యాన్ని ఆస్వాదిద్దాం.
స్నానంబుల్ నదుల యందు జేయుట
– గజ స్నానం బుచందంబగున్
మౌనం బొప్ప జపించు వేదమటదీ-
మధ్యంబులో నేడ్ప గున్
నానా హోమములెల్ల బూడిదలలోనన్ వేల్చు- నెయ్యై చనున్
నీనా మోక్తియు నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణ
అంటూ వైకుంఠ వాసా! నీ నామస్మరణమూ నీ పాద పద్మాలకూ సేవ చేసే అదృష్టంలేకుండా, గంగా, గోదావరీ లాం టి నదులందు స్నానము చేస్తే అది గజ స్నానంలాగాని నిష్పల మవుతుంది. వేదాలను వల్లె వేయడమూ అరణ్య రోదనమే అవుతుంది. యాగాలెన్ని చేసినా ఆ ప్రక్రియ బూడిదలో హో మం చేసిన నయ్యిలాగా వ్యర్థమవుతుంది. కావున నారాయణ నామ స్మరణతోనే సర్వ కర్మలను ఆచరించే ధర్మము వర్ణితం. భగవత్ ప్రీత్యర్థం చేసే కర్మలన్నీ స్నానంతోనే ఆరం భమ వుతాయి. అన్ని వర్ణముల వారికీ, ఆశ్రమవాసులకూ సాధారణ మైన స్నానవిధి అయిదు విధాలుగా తెలుపబడినది శాస్త్రంలో.
శ్లోకము స్నానంహి పంచ పుణ్యాని- కీర్తితాని మహిర్షిభి:
ఆగ్నేయం వారుణం బ్రాహ్మం- వాయువ్యం దివ్య మేవ చ ఇందులో ఐదు స్నాన విధులను తెలిపారు.
1. ఆగ్నేయం – అనగా హోమ భస్మలేపనం చేసుకోవటం
2. బ్రాహ్మ్యం- మంత్ర పూతమైన నీళ్ళను చల్లుకోవడం
3. వాయువ్యం- గో ధూళిని తమకు సోకించుకోవడం
4.దివ్యం- ఎండలోనైనా, వానలోనైనా నిల్చి ఉండడం.
5. వారుణం- జలమునందు స్నానం చేయడం.
జల స్నానం చేసే అవకాశంలేని వారికీ, అశక్తులకు ఆగ్నే యాది స్నాన విధులు నాలుగు. శక్తిమంతులకే వారుణీ స్నానం విధిగా ఆచరణీయం. సూర్యోదయం కంటే ముందే స్నానం చేయడం ఆరోగ్యకరం. వర్చస్సు కలుగుతుంది.
గంగా, యమున, కావేరీలాంటి పుణ్యనదీ జలాల్లో స్నా నం చేస్తే శరీరానికి మాత్రం బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. కాని ఆత్మశుద్ధి కలగదు. తీర్థం చేసి వచ్చాము అని గొప్పలు చెప్పు కోవడానికే ఉపయోగపడుతుంది. అందుకే వేమన శతకంలో ” ఆత్మ శుద్దిలేని ఆచార మదియేల” అన్నాడు. కావున నారాయణ నామాన్ని స్మరిస్తూ స్నానం చేయడం వలన, బాహ్య శుద్ధీ, అంత: శుద్ధి కలిగి సాత్విక గుణంవృద్ది చెందుతుంది. దక్ష స్మృతి అనే గ్రంథంలో స్నాన విశేషం
ఇలా ఉంది. ధ్యాయేత్ నారాయణం దేవం- స్నానాదిషు చకర్మసు బ్రహ్మ లోకమవాప్నోతి- న చేహ వర్తతే పున: అంటూ
స్నానాదికర్మల నాచరించు వేళ నారాయణు ని ధ్యానిస్తే భగవత్‌ప్రాప్తి కలుగుతుంది. యతే పతివ్యాం రజస్వ మాంతరిక్షే విరోదసీ
ఇమాంస్తదాపో వరుణ:- పునాతే అఘమర్షణ: అని అఘర్షణ సూక్తంలో తెలుప బడింది.
స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో ఎన్నో జన్మలెత్తి- ఏ ఏ పాపా లు చేశామో, వాటన్నిటినీ పోగొట్టి జలాధి దేవత అయిన ‘వరుణ’ శబ్దం వాచ్యుడైన శ్రీ మన్నారాయణుడు మమ్ము పరి శుద్ధులను చేయుగాక! అని ధ్యానిస్తూ జల స్నానం చేస్తే భగవం తుని అనుగ్రహం కలుగుతుందని వేదవాణి. ఏనుగు జలంలో స్నానమాడి, ఒడ్డుకు చేరి తొండంతో దుమ్ము ధూళిని ఎత్తి తన దేహంపై చిమ్ముకుంటుంది. దీనినే గజ స్నానం అంటారు. ఇది వ్యర్థము. రజో వృద్ధియేగాని సత్య వృద్ధి జరగదు నారాయణ నామస్మరణం లేకుండా పుణ్య నదీ జలాల్లో తీర్థమాడితే గజ స్నానం లాగా నిష్ఫలమౌతుంది.
వేద పఠనానికి ముందు హరి: ఓం అని ఆరంభించాలి. పఠనానంతరం హరి ఓం అని ముగించాలి. ఓంకారానికి ముం దు విసర్గతో కూడిన హరి పదాన్ని ఉచ్ఛరించాలి. నారాయణుడు అధ్యయనం చేత సంతుష్టుడై ఫలాన్ని ప్రసాదిస్తాడు. విద్వాంసులైన వారు వేదాధ్యయనానికి ముం దు, తర్వాతనూ ప్రణవాన్ని స్పష్టంగా ఉచ్ఛరించాలని శాస్త్రం. యజ్ఞ పురుషుడు యజ్ఞ భోక్త ప్రభువైన నారాయణుడని, చరణ కమల సంస్మరణ రహితంగా, ఎన్నికల క్రతువులు చేసి నా, ఆ ప్రయత్నమంతా అగ్గిలోకాక బుగ్గిలో పోసే నేతి ధార లాగా నిరర్థకమౌతుంది. ముకుంద మాలలో ఒక శ్లోకంలో ఇలా ఉంది.
ఆమ్నాయా భ్యసనా న్యరణ్య రుదితం- వేద వ్రతాన్యన్వహమ్
మేదశ్చేద ఫలాన్ని- పూర్త విధయ: సర్వేహుతం భస్మని”
ద్వంద్వాం భోరుహ-సంస్మృతిం-విజయతే-
దేవస్సనారాయణ:
సర్వ కర్మ సమారాధ్యుడైన నారాయణుని స్మరిస్తూ స్నానాది సమస్త కర్మల నాచరించడం ఎంతో శ్రేయస్కరం.
” ఓం నమోనారాయణాయ:”
– పి.వి. సీతారామమూర్తి
9490386015