Saturday, November 23, 2024

కరుణ చూపేది చల్లని దైవం

అరిషడ్వర్గాలు మనిషిని ఎదగనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అహం హద్దు మీరిన వ్యక్తి అజ్ఞాని అవుతాడు. అహం ఎవరో, ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసే జిజ్ఞాసపరుడు జ్ఞాని అవుతాడు. అహంకార మమకారాలు వ్యక్తి అభివృద్ధికి ముఖ్య అవరోధాలు. తన కోపమే తన శత్రువం టారు. క్రోధికి మిత్రులుండరు. శత్రువులే అధికంగా ఉంటారు. అసంఖ్యాక ములుగు ఆశలకు లోనై కామక్రోధములను మనిషి ఆశ్రయించును. ఇంద్రియ భోగములు కొరకు చౌర్య వంచనాదు లుచే ధనమును కూడబెట్ట చూతురు. ఉన్న ధనముతో వారికి సంతృప్తి ఉండదు. ధనవంతుడనని ఖ్యాతి తనకు కలగాలని అక్రమ దారుల ద్వారా సహితం విత్తార్జన చేస్తారు. బలం ఉంటుంది. అసురీయ శక్తులు (సంపదలు) కలవారు తాము ధార్మికుల మని చాటుకుంటారు, తమ సంపదలను చూసుకుని గర్విస్తారు, తమయందు అతి పూజ్యభావము ఆరోపించుకుం టారు. ఈ అపార ధనం తాము సంపాదించినది అనుకుంటారు. కాదు, భగవంతుడు ప్రసాదించినది. మనం ధర్మకర్తలమే కాని యజమానులం కాము. మనకు ఎంత అవసరమో అంతే మనది. మిగిలినది అతనికే నివేదిం చాలి. ఇక్కడ నివేదించాలి అంటే దాన ధర్మాల వంటి పుణ్యకార్యాల కు వినియోగించాలి.
కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం ఈ ఆరుగురే అసలు శత్రువులు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మనం ఇతరు లతో పెంచుకుంటున్న వైరానికి, వ్యతిరేకతలకు కారణం వేరెవరో కాదు మనమే అని తెలుస్తుంది. మనలో ఏదో లోపం లేనిదే ఎవరి తోనూ మనకు తీవ్ర వైరుధ్యం ఏర్పడదు. అందుకే ప్రహ్లాదుడు తండ్రితో అంటాడు…

”లోకములన్నియున్‌ గడియలోన జయించిన వాడ వింద్రియా
నీకము చిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్దు జేయు నీ
భీకర శత్రువులార్వు బ్రభిన్నుల చేసి ప్రాణికోటిలో
నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా!”
”నాన్నా! నీవు అన్ని లోకాలను జయించిన పరాక్రమశాలివి. అయినా నీవు ఇంద్రియాల్ని,

మనస్సును జయించలేకపోయావు. నీలోనే ఉండి, నిన్ను దృఢంగా బంధించి ఉంచిన ఆరుగురు భయంకరమైన శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను గెలవలేకపో యావు. నిజంగా వారిని నువ్వు గెలవగలిగితే ఇక ఈ ప్రాణికోటిలో నీకొక్కడు కూడా విరోధి ఉండడు.”
కామ క్రోధ లోభ మోహాల్ని వదిలినవాడే ఆత్మను తెలుసుకో గలడు. ఆత్మజ్ఞానం లేని మూర్ఖులు నరకబాధల్ని అనుభవిస్తారు. ఈ ఆరింటిని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే ఎవరైనా వీరిలా నశించి పోతారు. కామం వల్ల రావణుడు నేలకూలాడు, క్రోధం వల్ల దూర్వా సుడు చెడిపోయాడు, లోభం వల్ల హిరణ్యాక్షుడు మరణించాడు, మోహం వల్ల భస్మాసురుడు భస్మమయ్యాడు, మదం వల్ల హిరణ్య కశిపుడు మట్టికరిచాడు, మాత్సర్యం వల్ల దుర్యోధనుడు మరణిం చాడు.
”పరమేశ్వరా! ఈ ఆరు నా ఇంద్రియాలను, మనస్సును, బుద్ధి ని పెడత్రోవను పట్టిస్తు న్నాయి. అందుచేత ఈ ఆరింటిని అంటే అరిష డ్వర్గాలను నీకు సమర్పిస్తున్నాను” అని భగవంతుడికి సమర్పిస్తే మన మనస్సు ప్రశాంతమైన సరోవరంలా ఉంటుంది. నేడు మన మనస్సును కూడా ఈ ఆరుగురు శత్రువులే ఆవహించి, ఆడిస్తున్నాయి. మిత్రులను కూడా శత్రువులను చేసి పెడు తున్నాయి. మనం ఏదో క్షణంలో సర్దుకుపోదామని అనుకుంటు న్నా, లేదు కత్తులు నూరమని రెచ్చకొడుతున్నాయి. మనం ఒక అడుగు ముందుకు వేద్దాం, పంతాలను వదిలేసి ఆత్మీయహస్తం సాచుదాం. ప్రతీకారం తీర్చుకుంటే మన పగే

చల్లారుతుంది కానీ క్షమించి ప్రేమతో అక్కున
చేర్చుకుంటే వారిలో పశుత్వమైనా నశించి
పోతుంది. మరిగిపోయేది మానవ హదయం.
కరుణ చూపేది చల్లని దైవం. మరిగిపోకుండా
పగలూ ప్రతీకారాలూ వీడి మనస్సును
మల్లెపూవుగా పరిమళింపజేద్దాం

– గుమ్మా ప్రసాదరావు
9755110398

Advertisement

తాజా వార్తలు

Advertisement