-తొలి రోజు 9వేల మంది రాక
-రూ.13.50లక్షల ఆదాయం
అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన గురువారం దుర్గమ్మ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తొలి పూజలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు పాల్గొన్నారు. స్వర్ణకవచాలంకృత రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాల మొదటి రోజు కావడంతో ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాదికాలన్నీ పూర్తి చేసి ఉదయం 9గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. భక్తుల శరణుఘోష మధ్య దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జీ.వాణీమోహన్, కృష్ణాజిల్లా కలెక్టర్ జే.నివాస్, విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డీ.భ్రమరాంబ, దేవదాయశాఖ ఉన్నతాధికారి త్రినా ధరావు తదితరులు వీక్షిస్తుండగా పల్లకీలో గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారు ఊరేగింపు జరిపారు. లక్ష కుంకుమార్చన వేదిక వద్దకు అష్టభుజి అయిన దుర్గమ్మ పూజా మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్టిం చారు. ఆన్లైన్లో ముందస్తు టిక్కెట్లు బుక్ చేసుకు న్న వారిని మాత్రమే అధికారులు దర్శనాలకు అను మతించారు. ప్రతి గంటకు వెయ్యి మంది భక్తులు వచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడంతో తొలి రోజు 9వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదములు, దర్శనం టిక్కెట్లు, ప్రత్యేక పూజల ద్వారా రూ.13.50లక్షల ఆదాయం తొలి రోజు వచ్చిన ట్లు అధికారులు పేర్కొన్నారు. ‘గత ఏడాది మాదిరి గానే రోజుకు 10వేల మందికి మాత్రమే దర్శనాలు చేసుకునే అవకాశం ఉండటంతో ఏటా ఉండే రద్దీ కనిపించ లేదు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో మాదిరి అంతరాలయ దర్శనం కాకుండా ముఖ మండప దర్శనాలకు మాత్రమే అధికారులు అనుమతిచ్చారు.
కోవిడ్ నిబంధనలతో..
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేశారు. మాస్కు లతోనే భక్తులను దర్శనాలు చేసుకునేందుకు అధికా రులు అనుమతిచ్చారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి దర్శనం వరకు మూడు క్యూ మార్గాల్లో భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఘాట్ రోడ్డు పైభాగంలో ఓం టర్నింగ్ వద్ద ఉచిత, రూ.100, రూ.300 క్యూలైన్లలో భక్తులను అమ్మవారి దర్శనా లకు పంపారు. దర్శనానంతరం మెట్ల మార్గంలో కిందకు భక్తులు వచ్చి ప్రత్యేక కౌంటర్లలో ప్రసాదాలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నా రు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. భక్తులకు క్యూలైన్ మార్గాల్లో బిస్కెట్లు, టీ పంపిణీ చేశారు. పిల్లలకు పాలు పంపిణీ చేశారు. భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను కార్యనిర్వహ ణాధికారి డీ.భ్రమరాంబ, దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు పర్యవేక్షించారు.
కన్నుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement