తిరుమల ప్రభన్యూస్ ప్రతినిధి: తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతి పాత్రమైన గరుడ వాహనం పై మాడవీధులలో ఊరేగి భక్తులకు దర్శన మిచ్చారు.
గరుడ వాహనం.. సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. ఆచార్యుడు గరుడుడుని వేద స్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం మాతృభక్తి, ప్రభు భక్తి, సత్యనిష్ట, నిష్కలం కత, ఉపకారగుణం సమాజానికి స్తూర్తిదాయ కాలు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా పౌర్ణమి గరుడ సేవ
Advertisement
తాజా వార్తలు
Advertisement