Saturday, November 23, 2024

కనకదుర్గమ్మ సేవలో… తిరువవాడుతురై ఆధీనం పీఠాధిపతి

అమరావతి,ఆంధ్రప్రభ: తమిళనాడులోని తిరువ వాడుతురై అధీనం పీఠాధిపతి శ్రీ పరమాచార్య స్వామిగల్‌ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన స్వామిగల్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామీజీ శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు స్వామీజీకి వేద స్వస్తి పలికగా కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ అమ్మ వారి చిత్రపటం, ప్రసాదములు స్వామీజీకి అందజేశారు.
పంచహారతులు పున: ప్రారంభం
కోవిడ్‌-19 నేపధ్యంలో నిలిచిపోయిన కృష్ణానది పంచహారతుల కార్యక్రమాన్ని తిరిగి పున: ప్రారంభించారు. కృష్ణానదిలోని దుర్గా ఘాట్‌లో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల(దుర్గగుడి) ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో బుధవారం ఆలయ కార్యనిర్వ హణాధికారి డి.భ్రమరాంబ కృష్ణా నదీమ తల్లికి పూజలు జరిపి పవిత్ర కృష్ణా హారతులు పున: ప్రారంభించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హారతుల విశిష్టత ను శ్రవణం చేస్తూ వీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement