సబ పర రామ తపస్వీ రాజా!
తినకే కాజ సకల తుమ సాజా!!
శ్రీరామచంద్రుడు మానవ దేహం ధరించిన పరబ్రహ్మము.
ఆజన్మ శుద్ధుడు. పుణ్య శ్లోకుడు. ఉదాత్త మహనీయ మూర్తి. అయోధ్యా ప్రజలకే కాదు, తపస్వులకు రాజు. అంటే తాపసుల హృదయవాసి, హృదయాధినాధుడు.
తమస్సులను హరించే చంద్రుడు. ఆయన అవతార కార్యక్రమంలో అయోధ్యను ఏలటం ఒక భాగం మాత్రమే!
దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, అధర్మ విచారణ, ధర్మాచరణ రామావతార లక్ష్యం.
తాను దైవతమే అయినా మానవుడిగానే జీవించ నిర్ణయించుకున్న పరిపూర్ణ మానవతామూర్తి.
అవతార పరమార్థాన్ని పరిపూర్ణంగా సాధించటమే ఆయన లక్ష్యం. లోకంలో ఉన్న సర్వశక్తులను సమీకరించుకుని సమన్వ యం చేసుకుని లక్ష్యాన్ని సాధించటం దైవలక్షణం.
శ్రీరామచంద్ర ప్రభు అవతార లక్ష్య సాధనలో జరిగే సమస్త కార్యక్రమాలను నిర్వహించగల సమర్థుడు, హనుమ.
రామ కార్య నిర్వహణలో ఏమరుపాటు లేదు, ప్రమత్తత లేదు. ఉన్నదంతా అంకిత భావమే. దీక్షాదక్షతే!!
ప్రథమ దర్శనం నుండీ పట్టాభిషేకం వరకు హనుమ నిర్వహించిన పాత్ర అనుప మానమైనది.
దాస్య భావంలోనే కాక, దాసోహ స్థితిలోనే కాక, సోహం స్థితిలో సాగించిన హనుమ కార్యదక్షత లోకోత్తరం.
హనుమ అసలు పేరు సుందరుడు, ఆంజనేయ నామం తల్లిపరంగా, కేసరినందన విశేషణం తండ్రి పరంగా ఆయనకు లభించినయ్.
హనుమ పదం ఓంకార ప్రతీక… ఆపై ద్వాదశనామాలున్నా, ఆయన సుందరుడు. అంటే ఆత్మ సౌంద ర్యానికి ఆయన సాకారం!
– వి.యస్.ఆర్.మూర్తి
9440603499
ఓంకార ప్రతీక… హనుమ పదం!
Advertisement
తాజా వార్తలు
Advertisement