Friday, November 22, 2024

ఉదంక మహర్షికి శ్రీ కృష్ణ విశ్వరూప సందర్శనం

శ్రీకష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని బాల్యంలో తల్లి యశోదామాతకు, రాయబార సందర్భంలోను తర్వాత కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడికి గీతోపదేశం చేస్తూ, ప్రదర్శించినట్లుగా మనకు తెలుసన్న విషయమే. అయితే ”ఉదంక మచహర్షి”కి కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు పురాణాలు, మహాభారతం తెలియచేస్తున్నాయి. ఆయన ఎందుకు తన విశ్వరూపాన్ని ఏ సందర్భంలో చూపించాడో తెలుసుకొందాం!

శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి బయలుదేరి, ద్వారకకు వెడుతూ, దారిలో ఉదంక మహర్షి ఆశ్రమాన్ని చూసాడు. మహర్షుల సందర్శనం ఊరికే పోదు, అని ఆశ్రమంలోకి ప్రవే శించి మహర్షిని సందర్శించాడు. ఆ ఉదంక మహర్షి శ్రీకృష్ణుడుకి అతిథి మర్యాదలు చేసొడు. పరమాత్మ సంతోషించాడు. అతిథి సత్కారాలు అయిన తర్వాత మహర్షి శ్రీ కృష్ణునితో ”కృష్ణా! పక్షపాతం, పాపం అంటని నువ్వు సర్వజనులు సంతోషించేటట్లుగా, కౌరవ- పాండవుల బంధు త్వం బలపడేటట్లు చేసావా? కురు- పాండవులుకు రాజ్యభాగం వచ్చేటట్లు, వారు సుఖంగా రాజ్యపాలన చేయడానికి ఏర్పాట్లు చేసావా?” అని వ్యంగ్యంగా అడి గాడు. (అప్పటికే యుద్ధం పూర్తి అయిపోవడం, ధర్మరాజు హస్తినకు పట్టాభిషిక్తుడవ్వడం, జరిగిపోయాయి. ఈ విషయము తెలుసున్నా మహర్షి పరమాత్మను దెప్పి పొడిచాడు) మహర్షి మాటలలోని వ్యంగ్యా న్ని, నిందాపూర్వక మాటలను శ్రీ కృష్ణుడు గ్రహంచాడు. ఏమీ తెలియ దన్నట్లుగా, ”మహర్షీ! కురు పాండవుల మధ్య సంధి చేయడానికి వెళ్ళి, సమంజసంగానే మాట్లాడాను. సామ, దాన భేద, దండోపాయాలు ఉపయోగించాను. అ#హంకారం వీడి సామరస్యంగా ఆలోచించమని హెచ్చరించాను. అయినా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, అతని సోదరులు సుముఖంగా లేరు. సభలో ఉన్న భీష్మ, ద్రోణ, కృపాచా ర్యులు, మునులు, పండితులు కూడా చెప్పి చూసారు. పేరాశవల్ల సంధికి అంగీకరించకుండా యుద్ధం కోరుకొని, ఆ యుద్ధంలో కౌరవులు, కొంత మంది పాండవులు కూడా వీరమరణం పొందారు.
ఉత్తమ లోకాలకు వెళ్ళారు. కాలనియమాన్ని ఎవరూ అతిక్రమించ లేరు కదా!” అని శ్రీకృష్ణుడు అనగానే, ఉదంకమహర్షి ”కృష్ణా! మోసంతో కురువంశాన్ని నాశనం చేసావు. నీవు సమర్థుడవై కూడా సంధి నేర్పుతో చేయలేదు. నీకు శాపం పెడుతున్నాను.” అనగానే శ్రీకృష్ణుడు ”మహర్షీ! ముందుగా నా మాటలు తేటతెల్లంగా విని, తర్వాత నీకు తోచినట్లు చేయి. మునికి కోపం క్షేమకరం కాదు. నీ మహాతపస్సు, సుస్థిరమైన నీ బ్రహ్మ చర్యం, నన్ను శపిస్తే వ్యర్థంకావా? ఉదంకా! సత్త్వ, రజో, తమో గుణాలు నాయందే ఉంటాయి. మరుత్తులు, వసువులు, మొదలైన దేవతలంద రూ నానుండే పుట్టారు. నేనే సృష్టియందంతటా వ్యాపించి ఉన్నాను.
నాలోనే నిశ్చలంగా సృష్టి ఉంది. ఓంకారం ఆదిగా గల నాలుగు వేదాలు, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు వాటి విధులు, స్వర్గం, మోక్షం, నా రూపాలే అని తెలుసుకో! యజ్ఞ పరాయణులు, నన్ను స్తుతిం చి పుణ్యఫలాన్ని పొందుతారు. పాపులు కూడా ప్రాయశ్చిత్త కర్మలు చేసి నన్ను స్తుతించి దోష విముక్తులవుతారు. సర్వకాలాల్లోను మహమ కలి గిన నేనే బ్రహ్మగా సృష్టి, విష్ణువుగా స్థితిని, శివుడుగా లయాన్ని చేస్తుం టాను. దుష్టశిక్షణ, శిష్ట రక్షణం చేయగలిగే వాడినైనప్పటికి, కౌరవుల పాండవుల సఖ్యత గురించి నేనెంతో పాటుపడ్డాను నా ప్రయత్నాలను బ్రహ్మజ్ఞానులు వ్యాసాది మహర్షులు ఎందరో మెచ్చుకొన్నారు.” అని శ్రీ కృష్ణుడు చెప్పగానే, ఉదంక మహర్షి వినయంతో ”ఇప్పుడు నువ్వు చెప్పిన విశేషాలన్నీ, నాకిదివరకే తెలుసు. నీచకోపంతో కూడిన అహం భావం నా మనస్సును కప్పేసింది. నీ అమృత తుల్యమైన వాక్కులతో నన్ను నిర్మలుడును చేసావు. కృష్ణా! నీ మహానుగ్రహానికి అర్హుడైతే, నా. మనో నేత్రాలు ఆనందించేటట్లుగా, నీ విశ్వరూపాన్ని చూపించుమని కోరాడు. దయామయుడైన శ్రీ కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిం చాడు. ఆ మహర్షి భయకంపితుడై, చేతులు జోడించి, పురుషోత్తముడైన నీకు నమస్కారము. ఆయన శరీరం పారవశ్యంతో నిశ్చలమైంది. కొంత సేపు నిశ్చేష్టుడై, తొట్రుపడని గొంతుతో ”పద్మనేత్రా! పరమాత్మ! భూమి అంతటా నీ పాదాలు నిండి ఉన్నాయి. భూమ్యాకాశ మధ్య ప్రదే శాన్ని నీ ఉదరభాగం ఆక్రమించింది. ఆకాశాన్ని, మహోజ్ఞ్వలమైన నీ శిరస్సులు కప్పివేశాయి నీ మహాభుజాలు సర్వదిక్కులయందూ వ్యాపించి ఉన్నా యి. నీ విశ్వరూపం నా కన్నులనూ, మనస్సునూ తృప్తిపరచింది. ఈ నీ విశ్వరూపాన్ని మరల్చి సహజరూపాన్ని దర్శించు”మని కోరగా శ్రీకృష్ణు డు తన సహజరూపంలోకి వచ్చాడు. ఉదంకమహర్షి తన తప్పును, తొందరను క్షమించమని కోరగా దయామయుడైన పరమాత్మ ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు మహర్షి ”దేవా! ఇది నిర్జల ప్రదే శం. ఏడాది పొడవునా నీళ్ళుదొరకవు. సంవత్సరమంతా నీరు దొరికే ఏర్పాట్లు చేయమని కోరగా పరమాత్మ ఏర్పాట్లు చేసి ఇక మీరు నీటికి ఇబ్బంది పడక్కర్లేదు. అని వరమిచ్చి, మహర్షి వద్ద శలవు తీసుకొని బయలుదేరాడు.

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement