బ్రహ్మమును తెలుసుకొనగోరువారు మూలమును, మూలాధార విషయాలను గూర్చి చర్చించుకుంటారని ”శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమా ధ్యాయంలో తెలుపబడింది. ఒక శ్లోకంలో ఇలా ఉన్నది.
శ్లో|| హరి: ఓం బ్రహ్మ వాదినో వదంతి
కిం కారణం బ్రహ్మ కుత: స్మజాతా
జీవామకేన – క్వచ సంప్రతిష్టా
అధిష్టితా: కేన- సుఖేతరేషు వర్తా మహే బ్రహ్మ విదో వ్యవస్థామ్”
అంటూ వేదవిదులు చర్చించుకుంటూ, బ్రహ్మము అనగా వేదమనీ, దీనికి మూలకారణం ఏది? బ్రహ్మమా? మన జన్మ ఎలా వచ్చింది ? జీవించడందేనికి? మన చరమ స్థానం ఎక్కడో? ఎవని నియమాలకు కట్టుబడి మనం సుఖదు:ఖాల వ్యవస్థకు లోబడి ఉంటున్నాం?
జన్మ అనేది సృష్టి రహస్యానికి సంబంధించినది. మూల కారణం బ్రహ్మమై ఉంటుందని చర్చించి, అద్వితీయమైనది బ్రహ్మ ము అన్నారు.
పరబ్రహ్మ స్వరూపం గురించి ఆలోచన చేశారు. విశ్వంలో ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని తెలిపారు. జీవితానికి, జన్మ కు కారణాలను, ఉద్దేశ్యాలను, జీవితానికి సృష్టికి గల సంబంధము లను చర్చించారు వేదవిదులు.
సుఖ దు:ఖాలను అనుభవిస్తున్న కారణం వలన కాలము- ప్రకృతి – నియమం- యాదృచ్చము- పదార్థము- శక్తి -బుద్ది ఇవేవి మూల కారణం కాదని పరిశీలకులు భావించారు. ఇవన్నియు సృష్టింపబడినవి. వీటికి ప్రత్యేకమైన సత్తా ఉంది. ఆత్మ అనేది ఒకటి ఉన్నా, అది కూడా స్వతంత్రం కాదనీ, సుఖ దు:ఖాలు దాన్ని నియ మిస్తున్నవని తెలిపారు.
విశ్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానిని గూర్చిన జ్ఞానం అత్యవసరం. విశ్వంలోని ప్రకృతిని గుర్తించడానికి కూడా ఒక గుర్తించే ఆత్మ కావాలి. విశ్వానికి మూల కారణం దాని సహజ ధర్మమే. వేదవిదులు పరమ సత్తను చక్రరూపమైన విశ్వంగా భావించి ధ్యానిస్తామన్నారు. ఈ విశ్వం మనసుపై ఆధారపడి యున్నదనీ, దానిని అతిక్రమిస్తే విశ్వం అదృశ్యమౌతుందని అన్నారు.
ఇంక పరమ బ్రహ్మ విషయానికి వస్తే అది నాశ రహితమైనది. ఇది తెలిసిన వేదవిదులు బ్రహ్మమునందే నిష్టగా ఉంటారు. జన్మ రాహిత్యం పొందుతారు. పరతత్వమే పరబ్రహ్మమని వేదాల్లో తెలుపబడినది. ఈ విశ్వంలో క్షరాక్షరాల- వ్యక్తావ్యక్తాల కలయికచే ఏర్పడుటకు భగవంతుడు స్థితి కారకుడు. భగవంతుని గూర్చి తెలు సుకోనంత కాలం, జీవాత్మ ప్రాపంచిక సుఖాలలో ఆసక్తి వలన బద్ధ మై ఉంటుంది.
మాయ కూడ జన్మరహితమే. దు:ఖములకు కారణం కర్త- కర్మల సంయోగమే అని పతంజలి సూత్రాల్లో అనావశ్యకమైన దు: ఖం గాఢ సమాధిలో శాశ్వతంగా తెగిపోయి, చివరకు బ్రహ్మమం దు కలిసిపోతాయి.
ఇంక ఉపనిషత్తులో ఒక శ్లోకం ఇలా తెలిపింది.
శ్లో|| జ్ఞాత్వాదేవం- సర్వ పాశాపహాని:
క్షీణౖ క్లేకై: జన్మ మృత్యుప్రహాణి :
తస్యాభి ధ్యానాత్ తృతీయం- దేహ భేదే
విశ్వైశ్వర్యం కేవల- ఆప్త కామ:||
అంటూ భగవంతుని తెలుసుకోవడం చేత అన్ని బంధాలు వీడిపోతాయి. దేహ స్మృతిని దాటి, అద్వితీయుడై, కోరికలు నెర వేరుతాయి. అవిద్య క్షీణించి జనన మరణాల చక్రం ఆగిపోతుంది. ఈశత్వాన్ని పొందుతాడు. దీనికి మించినదేమీ లేదని తనయందే ఆత్మ సుస్థిరమై యున్నదని తెలుసుకుంటాడు. ప్రణవంపై ధ్యానం చేయడం వలన శరీరంలోని ఆత్మను ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రణవం అనగా ఓం కారం యొక్క ధ్యానం. సర్వ వ్యాపి అయిన భగవంతుని తెలుసుకోవడానికి, సత్యమూ, ఆత్మ నిగ్రహమూ, తపోధ్యానములను, తదేక నిష్టతో అన్వేషించినప్పు డు అజ్ఞాన వినాశకమైన ఆ పరబ్రహ్మ అవుతాడు.
ఆత్మానుభవం సకల దు:ఖాల నుండి విముక్తిని సూచిస్తుంది. భగవంతుని అంతర్యామిత్వం, పలు ఉపమానాలను ఈ ఉపనిష త్తులో పేర్కొనబడినది. ఆత్మ సంయమ పూర్వకమైన జీవితం ద్వారా చిత్తశుద్దిని సాధించవచ్చు. బుధ జనులు మనసుకు, బుద్దిని నియమిస్తారు. అంతర్యామి మహిమ ఎంతో గొప్పది. మహనీయ మైనది. ఈ అంతర్యామి విశ్వవ్యాపి, సర్వజ్ఞుడు- స్వయం జ్యోతి అనంతుడు గదా!
ఏ కొందరో ఆధ్యాత్మిక సాధనలను అభ్యసిస్తారు. తపోధ్యానా లనూ అభ్యసిస్తారు. బుధ జనులు అనుసరించిన మార్గాన్నే అను సరిస్తూ, స ంతత ధ్యానం ఆచరించి బ్రహ్మ తత్త్వాన్ని గ్రహిస్తారు.
ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు దివ్య సందేశం అందిస్తూ ఒక శ్లోకంలో ఇలా తెలిపాడు.
శ్లో|| యద్యదాచరతి శ్రేష్ఠ:- తత్త దేవతరో జన:
సయత్ ప్రమాణం కురుతే- లోకస్తు దనువర్తతే||
అంటూ ఉత్తములైన బుధ జనులు నడిచిన బాటలో, లోకం లోని జనులందరూ నడవాలనే దివ్యోపదేశం చేశారు.
పరబ్రహ్మ జ్ఞానం పొందాలంటే సమర్ధుడైన గురువు పర్య వేక్షణలో అధ్యయనం- మననం- విచారణలు తెలుస్తాయి.
జ్ఞానం అమృతత్వానికి గొనిపోతుంది. జ్ఞానం- ధ్యానం రెం డూ పరబ్రహ్మ తత్త్వానికి ఆలంబన అంటూ ఈ విశ్వమే పరబ్రహ్మ తత్త్వ జ్ఞానానికి జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చుకుని మనసు ను పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడే ఇంద్రియ నిగ్రహం అలవడు తుంది.
ఈ అంతర్యామ ఎవరు అనగా సకల సృష్టికీ మూలంగా గ్రహించబడి సకల ప్రాణుల హృదయాలలో శాశ్వతంగా, నిరంత రాయంగా వాటి ఉన్నతికి పనిచేస్తూ వుండే కారణభూతమై పర తత్త్వమే అంతర్యామి అని తెలిసి మసలాలి.
విశ్వానికి ఆత్మ అతడే. ఆయనే పరబ్రహ్మము. సర్వవ్యాపి- సర్వజ్ఞుడు జగద్రక్షకుడు, శాశ్వత పరిపాలకుడు.
ఓం సహనావవతు- సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వివావధీ తమస్తు
మా విద్విషావహై:|| ఓం శాంతి: శాంతి: శాంతి:||
– పి.వి.సీతారామమూర్తి
9490386015