Friday, November 22, 2024

ఈషణ త్రయం – వినాశ కారణం

”ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనమ్‌
ప్రత్యా యంతి గతా: పునర్నదివసా: కాలో జగద్భక్షక:
లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధున”

మనం చూస్తూ ఉండగానే ప్రతిదినమూ మన యవ్వనము, ఆయుష్షు నశించిపోతూ ఉన్నాయి. గడచిన రోజులు తిరిగిరావు. కాలం జగత్తునే భక్షించి వేస్తూ ఉంది. సం పద నీటి అలల వలె అతి చంచలమైంది. కనుక ఓ పరమేశ్వరా! నాపై కరుణ చూపి, నీ కు శరణాగతుడనైన నన్ను నీవు ఇప్పుడే కాపాడు, అంటూ ‘శివాపరాధ క్షమాపణ స్తోత్రం లో ఆదిశంకరాచార్యులవారు ఆ పరమేశ్వరుని ప్రార్థించారు. ఆ మిషతో బుద్బుదప్రాయ మైన మన జీవితాన్ని గురించి బోధ చేశారు. అటువంటి బోధల ద్వారా, పై విషయం మనం దరకూ తెలిసిందే అయినా, అజ్ఞానపు పొరలు క్రమ్మి ఉన్నంత వరకు, అహంకార మమకా రాలు మనల్ని వీడనంత వరకు, మనకు పరమార్థమైన సత్యం బోధపడదని నొక్కి చెప్పారు.
‘శ్రీకాళ#హస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి ఇలా చెప్పారు.
”అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటె రింగిన్‌ సదా
కాంతల్పుత్రులు నర్థము న్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిన్‌ చెంది చరించుగాని పరమార్థంబైన నీయందు తా
చింతాకంత యు చింతనిల్పడు కదా శ్రీకాళ#హస్తీశ్వ రా!”
ఓ కాళ#హస్తీశ్వర స్వామీ, ఈ ప్రపంచమంతా మాయ అని తెలిసిన తర్వాతకూడా మనుషులు నిరంతరం స్త్రీ, పుత్ర, ధన, శరీర వ్యామోహా లలో చిక్కుకొని, వాటిని శాశ్వతాల ని భావించి, పరమార్థమైన నీపై చింతాకంత ధ్యాస కూడా పెట్టరు కదా! ఇదెంత అవివేకము? అని భావము. పై పద్యంలో ధూర్జటి కవి చెప్పిన స్త్రీ, పుత్ర, ధన, శరీర వ్యామో హాలు మమ కార జనితాలు. నాది, నా వి అనుకొని వాటి పై అతి మోహాన్ని పెంచుకోవడమే మమకారం. శరీర వ్యామోహం అహంకారం. ఈ శరీ రమే నేను. ఈ రూపం, అందచందాలు, జవసత్వాలు నా సొంతం. నేను సాధించలేనిది ఏదిలేదు అనుకోవడమే అహంకారం. అహంకార మమ కారాల వలన మనసును అజ్ఞానమనే పొరలు కప్పివేసి, జ్ఞాన చైతన్యాన్ని కలుగనీయవు.
స్త్రీ, ధన, పుత్ర వ్యామోహములనే మూడింటినీ ”ఈషణ త్రయం” అని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు. ఈషణ అంటే కోరిక, వ్యామోహం. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే మూడు రకాలైన మోహాలతో మా నవులు పీడించబడుతూ, కర్మబంధితులై ఉంటారు. వాటి కోసం ఎలాం టి తప్పుడు పనులు చేయడానికైనా సాహసిస్తారు. తాను తనవిగా భావిం చిన దారా, పుత్ర, ధన, శరీరాలు తన వెంట రావని గ్రహంప లేరు.
”ధనాని భూమౌ, పశవశ్చగోష్ఠే / నారీగహద్వారి, సుత: శ్మశానే
దే#హశ్చితాయాం, పరలోకమార్గే / ధర్మా ను గో గచ్ఛతి జీవ ఏక:”
మానవుడు మరణించినప్పుడు అతడు సంపాదించిన ధనం దాచి ఉంచిన చోటే ఉండి పోతుంది. తాను పెంచుకొన్న పశువులు చావడిలోనే ఉండిపోతాయి. తాను అమితంగా ప్రేమించిన భార్య ఇంటి గుమ్మం వర కే వెంట వస్తుంది. కొడుకులు శ్మశానం వరకే వస్తారు. తనదనుకొన్న శరీరం చితిపై కాలి బూడిద అయిపోతుంది. మరి తనతోబాటు పరలోకానికి ప్రయాణించేది తాను ఆచరించిన ధర్మం లేదా అధర్మం మాత్రమే. కనుక వ్యామోహాల్ని వదలాలని పై శ్లోకం చెబుతోంది.
ఈ వ్యామో#హం ఊబిలో చిక్కుకొని సర్వనాశనం కొని తెచ్చుకొని న వారెందరో ఉన్నారు. రావణుని స్త్రీ వ్యామోహం అతని వివేకాన్ని, వైభవాన్ని, అతని వంశాన్ని, అతని సర్వస్వాన్ని నశింపచేసి ఉండ టం మనకు తెలిసినదే. తన భార్యపైగానీ, పరస్త్రీలపైగానీ మితి మీరిన కోరిక అనర్థహతువు. శివ భారత కావ్యంలో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రిగారు ఛత్రపతి శివాజీ నోట ఇలా పలికించారు.
”అనల జ్యోతులనీ పతివ్రతల పాపాచారులై డాయు భూ
జనులెల్లన్‌ నిజసంపదల్‌ దొరగి యస్తధ్వస్తులైపోరె? వి
త్తనమే నిల్చునె? మున్నెరుంగమె పులస్త్య బ్రహ్మ సంతానమో
జననీ!హందవభూమినీ పగిది దుశ్చారిత్రము ల్‌ సాగునే?”
విజయోత్సాహంతో, శత్రు దేశపు రాణివాసాన్ని, తన సేనాధి పతి అయిన అబ్బా జీ సోన్‌ దేవుడు, బంధించి తెచ్చిన సందర్భంలో, ఆ ముసల్మాను రాణితో, తమను క్షమించమని కోరుతూ శివాజి చెప్పిన పద్యమిది.
”అగ్ని కీలలవంటి సాధ్వీమణులను పాపచింతనతో తాకిన వారెవరైనా సర్వ సంపదలనూ కోల్పోయి, పతనమైపోతారు కదా! మనకు రావణాసురుని ఉదంతమే ఇందుకు ఉదాహరణ కదా! మన దేశ సంస్కృతిలో ఇలాంటి దురాగతాలకు తావులేదు” అంటూ, ఆ యవనరాణిని మాతృసమానురాలిగా గౌరవించి సకల సత్కారాలతో, క్షేమంగా, ఆమె భర్త వద్దకు చేరుస్తాడు శివాజి. అది మన భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యము.
‘రామ్‌ చరిత మానస్‌’ అనే హందీ భాషలోని రామాయణ కావ్య రచ యిత అయిన సంత్‌ తులసీ దాస్‌కు ఒకప్పుడు తన భార్యపై విపరీతమైన వ్యామోహం ఉండేదట. ఎప్పు డూ ఆమెనే స్మరిస్తూ, ఒక్క క్షణమైనా ఆమె ఎడబాటును భరించలేకపోయేవాడట. ఒక మారు అత్యవసరమైన పనిమీద తులసీదాసు వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఆయన భార్యను ఆమె సోదరుడు వచ్చి పుట్టినింటికి తీసుకు వెళ్ళాడట. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తులసీదాస్‌ తన భార్య పుట్డింటికి వెళ్ళిందని తెలుసుకొని, హోరుమని వర్షం కురుస్తున్నా లెక్కచేయక, ఆ కటిక చీకటిలోనే నదిని ఈదుకొంటూ మామగారింటికి వెళ్ళాడట. రాత్రి కావడం వలన ఆ ఇంటి తలుపులు మూసి ఉండటంచేత ఎలాగో కష్టపడి ఆ ఇంటి మేడ నెక్కి గవాక్షంలో నుండి లోనికి దిగి భార్య వద్దకు చేరాడట. అతని సాహసానికి ఆమె నివ్వెర పోయి ”రక్తమాంసములతో మలినమై, నశ్వరమైన ఈ నా దే#హంపై మీరు చూపే ఈ ప్రీతిని ఆ శ్రీరా ముని పాదాలపై చూపి ఉంటే ఎంతో ధన్యులయ్యేవారుకదా!” అని మందలించిందట. అం తే, తులసీదాస్‌కు జ్ఞానోదయమై, దారేషణను పరిత్యజించి, శ్రీరామ భక్తుడైపోయాడట. కనుక స్త్రీ వ్యామోహంకూడదని రావణుని, తులసీదాసుని గాథలు తెలియజేస్తున్నాయి.
ఇక రెండవది ధనేషణ. ధనం పరిమితంగా, మన అవసరాలకు తగినంత ఉంటే చాలు. కబీర్‌దాస్‌ ఇలా ప్రార్థించాడు.
”సాయీ, ఇత్‌ నా దీజియే, సామే కుటుంబ్‌ సమాయ్‌
మై భీ భూకా నరహూ, సాధూ నభూకా జాయ్‌!” ఓ దేవా, నేను, నా కుటుంబము, నా ఇంటికి వచ్చిన అతిథులు, ఆకలి తీర్చుకోగలిగినంత మాత్రం సంపద నాకు ఇవ్వుము” అని.
ధనేషణ చాలా చెడ్డది. ధనం కూడే కొద్దీ ఆశలు పెరిగిపోతూనే ఉంటాయి. ఆ ఆశలనే గుర్రాలకు కళ్ళెం వేయకుంటే అవి మనలను పతనమనే గోతిలో పడదోయక మానవు.
ఈషణ త్రయంలో చివరిది పుత్రేషణ. పుత్రుల కోసం పలవరించి, పుత్రకామేష్ఠి యా గంచేసి, నలుగురు కొడుకులను పొందిన దశరథ మహారాజు తన అంత్యకాలంలో ఏ కొడు కూ తన దగ్గరలేని స్థితిలో మరణించాడు. పుత్ర వ్యామో#హంతో తన కొడుకుల ఆగడాలకు కళ్ళెం వేయలేక ధృతరాష్ట్రుడు దుర్గతిని పొందాడు. తన వంశాన్ని నిర్వంశం చేసుకొన్నాడు. ధూర్జటి కవి చెప్పినట్లు
”కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకుల్‌ జీవన భ్రాంతులై
కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రు న కనేకుల్‌? వారిచే నేగతిల్‌
వడసెన్‌? పుత్రులు లేని ఆ శుకునకున్‌ పాటిల్లె నే దుర్గతుల్‌?
చెడునే మోక్ష పదంబ పుత్రకునకున్‌? శ్రీకాళహస్తీశ్వరా!”

వంద మంది కొడుకులనుకన్న ధృతరాష్ట్రునికి మోక్షం లభించలేదు. పుత్రులే లేని శుక యోగికి మోక్షం రాకుండా ఆగనూ లేదు. కనుక పుత్రుల కోసం కలవరించడం, పుత్ర వ్యామో #హంతో చేయకూడని పనులను చేయడం అవివేకమన్నాడు ధూర్జటి కవి. ఇవేకాకుండా శరీర, కీర్తి, అధికారం, పదవి వంటి వ్యామోహాల వల లో చిక్కుకోకుండా దైవ ధ్యానంతో గడపడమే స్థితప్రజ్ఞుల లక్ష ణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement