సంక్షిప్త రామాయణం
ఇందజిత్త్తుల క్ష్మణుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ పరస్పరం విజయ కాంక్షతో సర్వ శక్తులను ఒడ్డి పోరాడారు. దివ్యాస్త్రాలను దివ్యాస్త్రాలతోనే ఖండించారు. వారు మాటల బాణాలతో కూడా పోరాటం చేశారు. ఇంద్రజిత్త్తు మాయా యుద్ధాన్ని లక్ష్మణుడు ఎత్తి చూపి నిరసించాడు. ”నాగాస్త్త్ర బంధంలో చిక్కకుని విలవిలలాడిపో యారు. గుర్తు లేదా” అని ఇంద్రజిత్త్తు దెప్పి పొడిచాడు. ప్రగల్భ వచన పాటవంలో కూడా ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు.
ల క్ష్మణుడు వ్యూహాత్మకంగా ఇంద్రజిత్త్తు సారథి తల నరి కాడు. గత్యంతరం లేక ఇంద్రజిత్త్తు తానే స్వయంగా సార థ్యం చేస్తూ పోరాడాడు. వెంటనే ల క్ష్మణుడు అతడి రథాశ్వాలను నేలకూల్చాడు. ఇంద్రజిత్త్తు విర థుడై ఆకాశానికి ఎగిరి మాయాంధకారాన్ని సృష్టించాడు. ఆ చీకటి మాటున ఇంద్రజిత్తు లంకా నగరం చేరాడు. మరొక రథాన్ని, సారథిని సి ద్ధం చేసుకుని యుద్ధరం గంలో ప్రవేశించాడు.
లక్ష్మణుడు ఇంద్రజిత్త్తు ధనుసును ఖండించాడు. అతడు మరొక విల్లును చేపట్టాడు. లక్ష్మణుడు దానిని కూడా భగ్నం చేశాడు. తరువాత కవచాన్ని ఛేదించాడు. ఇంద్రజిత్తు రొమ్మున బాణాలను నాటాడు. వేడి నెత్త్తురు జివ్వున చిమ్మింది. మేఘనాదుని బాణాల వెల్లువలో ముంచాడు. మేఘనాదుడు ప్రయోగించిన బాణాలను లక్ష్మణుడు అతి కష్టం మీద నిలువరించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్త్తు సారథిని చంపాడు. ారథి లేకపోయినా గుర్రాలు రథాన్ని వలయాకారంలో త్రిప్పడం చూసి లక్ష్మణుడు
ఆశ్చర్యపోయాడు. ల క్ష్మణుడుడ తీవ్ర బాణాలను ప్రయోగించి రథాశ్వాలను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఇంద్రజిత్త్తు మూడు బాణాలు లక్ష్మణుని నుదుట నాటాడు. లక్ష్మణుని కవచాన్ని ఛేదించడానికి విఫల యత్నం చేశాడు. అది అభేద్యమని గ్రహించి, లక్ష్మణుని మర్మస్థానాలను గాయపరిచాడు. విభీషణుడు ఇంద్రజిత్తు రథాశ్వాలను గదతో మోది చంపాడు. ఇంద్రజిత్త్తు రథం నుంచి నేలకు లంఘించాడు. ఇంద్రజిత్త్తు ప్రయోగించిన శక్తినిలక్ష్మణుడు ముక్కలు చేశాడు. ఇంద్రజిత్తు కోపించి యామ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. లక్ష్మణుడు కుబేరుడు ప్రసాదించిన దివ్యాస్త్త్రాన్ని ప్రయోగించాడు. అవి రెండు నిప్పులు గక్కుతూ పోరాడి నేలపడ్డాయి. లక్ష్మణుడు ఐంద్రాస్త్తాన్ని ప్రయోగించాడు. అది రివ్వున దూసుకుపోయి ఇంద్రజిత్త్తు తల నరికింది.
వానరులు జయజయధ్వానాలు చేశారు. రాముడు ల క్ష్మణుని అక్కున చేర్చుకుని తల నిమిరాడు.
-కె. ఓబులేశు, 90528 47742
ఇంద్రజిత్తు వధ
Advertisement
తాజా వార్తలు
Advertisement