Saturday, November 23, 2024

ఇంద్రకీలాద్రిపై దీపోత్సవంలో స్వరూపానంద

అమరావతి, ఆంధ్రప్రభ: కార్తీక పౌర్ణమి సందర్భం గా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో విశాఖ శారదా రాజశ్యామల పీఠాధిప తులు శ్రీ స్వరూపానంద్రేంద్ర సరస్వతీ స్వామీజీ పాల్గొ న్నారు. ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జీ.వాణీ మోహన్‌, ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణా ధికారి డీ.భ్రమరాంబ, పాలక మండలి సభ్యలు స్వాగతం పలికారు. దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం ప్రారంభిం చిన స్వామీజీ కార్యక్రమ విశిష్టతను అనుగ్రహ బాషణం చేశారు. శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామీజీకి ఆలయ స్థానాచార్యులు, వేదపం డితులు వేదస్వస్తి పలికారు. శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement