Saturday, November 23, 2024

ఇంతకీ మీది ఏ స్నానం

బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం సిటీ లలోనే కాదు… పల్లెటూళ్ళలోనూ ఫ్యాషనుగా మారింది. అర్థ రాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపేసి… ఉద యం త్వరగా నిద్రలేవరు. సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎప్పుడు చేయాలి…?
న తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని ‘రుషి స్నానం’ అంటారు.
న 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని ‘దేవస్నానం’ అంటారు. ఇది మధ్యమం.
న 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని ‘మానవ స్నానం’ అంటారు. ఇది అధమం.
న 7గంటల తర్వాత చేసే స్నానాన్ని ‘రాక్షస స్నానం’ అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మము హూర్తంలో నిద్రలేచి, రుషి స్నానం చేయడం పుణ్యప్రదం. ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నా నం ఉత్తమమైనది.
ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరు వులో స్నానం మధ్యమం నూతి(బావి) వద్ద స్నానం చేయడం అధమం. వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.
పురాణాలలో స్నానం: మానవుల్ని పవిత్రులను చేసుకోవ డానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు. అగ్నియందలి దాహికశక్తి మనల్ని దహింపచేస్తుంది కనుక జలంతో శుద్ధి చేసుకోవడం అందుబాటు లో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయం. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.
మంత్ర స్నానం: వేదమందు చెప్పబడిన నమక, చమక,
పురుష సూక్తములను ఉచ్ఛరిస్తూ చేసేది మంత్ర స్నానం.
భౌమ స్నానం: పుణ్యనదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను ఒంటినిండా రాసుకొని చేసేది భౌమ స్నానం.
ఆగ్నేయ స్నానం: భస్మాన్ని మంత్ర సహతంగా లేదా శివ నామం ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది ఆగ్నేయ స్నానం.
వాయువ్య స్నానం: ముప్ఫైమూడు కోట్ల దేవతలు నివశించే గోమాత పాద ధూళి చేత చేసేది వాయువ్య స్నానం.
దివ్య స్నానం: లోక బాంధవుడు అయిన సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నప్పుడు కురిసేవానలో స్నానం చేయడం దివ్య స్నానం. ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
వారుణ స్నానం: పుణ్యనదుల్లో చేసే స్నానం వారుణస్నానం.
మానస స్నానం: నిత్యం నారాయణ నామస్మరణతో కామ క్రోధ లోభ మోహ మదమత్సర అహంకార మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం ‘మానస స్నానం’. ఇది మహత్తర స్నానం. ఇది మహా ఋషులు ఆచరించేది.
ఈ స్నానం కోసం అందరూ సాధన చేయాలి.
– కైలాస్‌ నాగేష్‌
98490 52956

Advertisement

తాజా వార్తలు

Advertisement