న్యాయ సలహాలు కోరుతున్నాం
టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులపై మంత్రి వెల్లంపల్లి
అమరావతి, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత నియామ కాలపై సాంకేతిక అంశాల నేపథ్యంలో హైకోర్టు స్టే విధించి ఉండవచ్చని, దీనిపై న్యాయ సలహాలు తీసుకుని, కోర్టు తీర్పును పరిశీలించి, ఏవి ధంగా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమ మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్ర నుంచి వచ్చే భక్తుల కోసం, హిందూ మత ప్రచారం కోసం, టీ-టీ-డీ బోర్డు కమిటీ-, ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని స్పష్టం చేశారు. ట్రస్టు బోర్డు సభ్యులకు కూడా బోర్డు మీటింగుల రోజు మాత్రమే రూమ్ ఉచితంగా ఇస్తారని, మిగతా రోజుల్లో వెళితే డబ్బులు చెల్లించాల్సిందేనని తెలిపా రు. అలాగే దర్శనాలకు సంబంధించి తనకు, భార్యకు మినహా తనతో వచ్చిన వారందరికీ ³కూడా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. ఈనేపథ్యం లో టీటీడీ బోర్డుపై అదనపు భారం పడే అవకాశమేలేదని పేర్కొన్నారు.
తీర్పును స్వాగతిస్తున్నాంరాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల నియామకంలో వ్యవహరించిన తీరుపై అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు కనువిప్పు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించా రు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక స్టే విధింపుపై సోము వీర్రాజు స్పందిస్తూ న్యాయస్థానం ఆదేశాలను బీజేపీ స్వాగ తిస్తోంద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా అడ్డగోలు ఉత్తర్వులు ఇవ్వడం మాను కోవాలని, టీటీడీ విషయంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు పేర్కొన్నారు.