Friday, November 22, 2024

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు, ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులకు పోటెత్తారు. దీంతో యాదాద్రి, వేముల వాడ, కొమురవెల్లి తదితరపుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలా డాయి. దేవుడి ధర్మ దర్శననాకి యాదాద్రిలో భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగు తుండడంతో… భక్తులు కాలినడకనే కొండపైకి చేరుకున్నారు. వేములవాడ దివ్య క్షేత్రంలోశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కరోనా కారణంగా గత ఏడాది నుంచి దసరా సందర్భంగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. అయితే ఈసారి కరోనా వైరస్‌ అదుపులోకి రావడం, కరోనా తర్వాత మొదటి దసరా పండగ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి కి పూజలు జరిపారు. ఆలయాలకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement