Saturday, November 23, 2024

ఆరాధనా ప్రక్రియకు అత్యావశ్యకాలు

భగవంతుని ఆరాధనలో మనం కొన్ని ప విత్ర ద్రవ్యాలతో పాటు భక్తి చిహ్నాలు కూడా ఉపయోగిస్తుంటాము. వాటిలో కొన్నిటిని పరిశీలిద్దాం. ముందుగా ఏ పనినైనా ‘శ్రీ’ కారంతో ప్రారంభించడం సంప్రదాయం. శ్రీని ల క్ష్మీ స్వరూపంగా భావించవచ్చు. కొందరు ఓంకారముతో మొదలుపెడతారు. ఓంకారం సమస్త విశ్వానికి ప్రతిరూపం. అంతేకాదు ఓం అనేది బీజాక్షరం. ఓంకారం త్రిమూర్తులను కూడా తెలుపుతుంది. ఓంకారమే సర్వ వేదాలకు మూలం. సర్వ మంత్రాలకూ ముందు చేర్చేది. ఇది త్రిగుణ తత్త్వాలు కలిగి ఉన్నది. అందుచేతనే అక్షరాభ్యాసం ీలో ముందు ఓం ను రాయిస్తారు.
అలాగే స్వస్తిక్‌ గుర్తును కూడా కొందరు శుభసూ చకంగా భావిస్తుంటారు. సూర్యదేవుని ప్రతిరూపమే స్వస్తిక్‌ గుర్తు. దీనిని వ్యాపార పుస్తకాల మీద ఇంటి గోడలపై కూడా వేస్తుంటారు. ఇక తరువాత వాటిలో పూర్ణ కుంభం ఒకటి. దీనిని క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృత కలశానికి గుర్తుగా భావిప్తారు. సంపూర్ణ సుఖ జీవనాన్ని ఇవ్వమని కోరటమే పూర్ణ కుంభ పూజ. గౌరవననీయులకు పూర్ణ కుంభంతో స్వాగతంచెబుతుంటారు. కొందరు ల క్ష్మీ పాదాలను ఇంటి గోడలపై వేస్తుంటారు. ఇది సకల శుభాలకు గుర్తు. సీమంతం చేసిన స్త్రీ పాదాన్ని కుంకుమపై అద్దించి ఆ పాద ముద్ర ఇంటిలో పడేలా నడిపిస్తారు. కమలం కూడా హిందువుల పవిత్ర చిహ్నం. కమలం బురదలోనూ, ధూళి మధ్య పుడుతుంది. అయితే అది మాత్రం స్వచ్ఛంగా, అందంగా ఉంటుంది. దాని అర్థం సమాజంలో కుట్రలు, కుతంత్రాల మధ్య నివసిస్తున్నా వాటికి అతీతంగా స్వచ్ఛంగా కమలంలా విరాజిల్లమని అర్థం. లక్ష్మీదేవి, తామర పూవులో కొలువై ఉంటుంది. చేతుల్లో పద్మాలను పట్టుకుని ఉంటుంది. లక్ష్మి అంటే ఐ్వర్యం శుభం. అటువంటి ఆమె కొలువై ఉండే ప్రదేశం కనుక తామర పువ్వుకి అంత ప్రాముఖ్యం. బ్రహ్మదేవుడు కూడా విష్ణువు నాభి నుంచి వచ్చిన కమలంలోనే ఉంటాడు. ఇక లక్ష్మీదేవికి ఇరు వైపులా రెండు ఏనుగులు ఉన్న చిత్రాలు ఉంటాయి. దీనికి ఒక అర్థం ధన బలం, గజ బలం వంటిదని చెప్పడమని అంటారు. తమలపాకును శుభ కార్యాలలో వాడుతుంటారు. అన్ని శుభ కార్యాలలోను తమలపాకును వాడుతారు. దీనిని సంస్కృతంలో నాగవల్లి అంటారు. ఇది దేవతా పత్రం. దీని తొడిమలో లక్ష్మీదేవి, మధ్యభాగంలోపార్వతీ దేవి, కొనభాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీ దేవి ఉంటారు. వీరే కాక ఇంద్రుడూ, మన్మథుడూ, విష్ణువూ, శివుడు , బ్రహ్మ తమలపాకుపై కొలువుతీరి ఉంటారు. కొందరి పూజ గదుల్లో శంఖం ఉంటుంది. శంఖం లక్ష్మీ స్వరూపం. శంఖాల్లో దక్షిణావర్త శంఖం శ్రేష్ఠమైనది. రుద్రాక్షలు దేవతల శక్తి స్వరూపాలు. సాలగ్రామాలు విష్ణు స్వరూపం.
దర్భలు కూడా అతి పవిత్రమైనవి. గరుత్మంతుడు తన తల్లి దాసీత్వాన్ని తొలగించటానికి దేవలోకం నుంచి అమృతకలశం తెచ్చి దర్భల మీద పెట్టి కద్రువ పుత్రులైన నాగులకు చూపి తన తల్లికి దాసీత్వం నుంచి విముక్తి కలిగించాడు. ఆ సందర్బంలో ఆమృత కలశం దర్భలపై ఉంచినందున అ కలశ స్పర్శ వల్ల అవి పవిత్రమైనవయ్యాయి. అయితే వీటి ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి క్షీర సాగర మథన సమయంలో నారాయణుడు మందర పర్వతం మునిగిపోకుండా కూర్మరూపుడై దానికాధారంగా పలిచాడు. మథన సమయంలో పర్వతం రాపిడి వలన స్వామి శరీరంపై ఉన్న రోమాలు సముద్రం ఒడ్డుకు చేరి దర్భలయ్యాయని ఒక కధ ఉండగా ఆది వరాహావతారంలో స్వామి శరీరం నుంచి రాలి పడిన వెం ట్రుకలే దర్భల రూపాన్ని పొందాయని మరో కథ ఉంది. అందువల్ల అంతటి పవిత్రమైన ఆవిర్భావం కలవి అయినందునే అవి ప్రాముఖ్యాన్ని, అర్హతను పొందాయి. ఇక మంగళద్రవ్యాల విషయానికి వస్తే పసుపు, కుంకుమ, గంధం, ఇవి శుభానికి సూచికలు. అక్షింతలు, పూలు పూజా ద్రవ్యాలలో ముఖ్యమైనవి. స్త్రీల విషయంలో నుదుటన కుంకు మ, మెడలో మాంగల్యం, తలలో పూవులు చేతులకు మట్టి గాజు లు. కాలికి మట్ట్టెలు, ఇవే పంచ మాంగల్యాలు, ఈ అయిందిం టిని వివాహితులైన స్త్రీలు ఎల్ల్లవేళలా ధరించాలని సంప్రదాయం. పురుషులు ధరించే యజ్ఞోపవీతం సకల దేవతా స్వరూపం. ముగ్గు, పసుపు, పువ్వులు, పళ్ళు, పాలు, ధూప, దీప, మంగళద్రవ్యాలు లక్ష్మీ స్థానాలు. పంచామృతాలతో అభిషేకం భగవంతునికి ప్రీతికరమైనది.

సర్వేజనా స్సుఖినో భవంతు

కోసూరు హయగ్రీవరావు
99495 14583

Advertisement

తాజా వార్తలు

Advertisement