Saturday, November 23, 2024

ఆధ్యాత్మిక సొగసులతో యాదాద్రి భారీ తోరణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపైన భారీ స్వాగత తోరణాన్ని నిర్మించేందుకు యాదాద్రి దేవా లయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) పనులు చేపట్టింది. ఆధ్యాత్మిక హంగులతో ఈ తోర ణం రూపకల్పన ఉండనుంది. తోరణాన్ని రెండు ఘాట్‌ రోడ్లను అనుసంధానం చేస్తూ మొత్తం 96 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడ వు, 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వ ర్యంలో పనులు వేగంగా జరుగుతున్నా యి. పాంచరాత్రగమ శాస్త్రాన్ని తెలియ జేసేలా శంఖు, చక్ర, తిరునామాలు, లక్ష్మీనృసింహుడు, గరుడ, ఆంజనేయస్వామి విగ్రహాలతో పాటు ప్రతి స్తంభంలోననూ యాళీ (సింహపు ఆకారపు) విగ్రహాలను ఈ భారీ స్వాగత తోరణంలో పొందుపర్చనున్నారు. పూర్తిగా ఆర్‌సీసీలో నిర్మిస్తున్న ఈ స్వాగత తోరణంలో కృష్ణ రాతి శిలల నిర్మాణాన్ని పోలేలా రంగులతో అద్దనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement