సహనము అంటే సమస్యను ఎలా ఉందో అలా వదిలివేసి నవ్వుతూ దానిని భరించు అన్న లోకం పోకడ కాదు. ఆధ్యాత్మిక సహనశీలత నీకు సమస్య మధ్యనే ఉండనిస్తూ పరిష్కారాన్ని చూపుతుంది. ఎందుకంటే అసహనము, అహంకారము, కోపము కన్నా సహనము ఎంతో గొప్పది. అంటే నువ్వు అవగాహనతో, జాగ్రత్తగా, ప్రేమపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తున్నావు అని అర్థం. స్నేహము, ప్రేమ భావాలు ఉన్న చోట కష్టాలను అధి గమించవచ్చు. దేనినైనా సహించడము అంటే సహకార భావాన్ని కలిగి ఉండి పరిష్కారయుతంగా ప్రవర్తిస్తున్నావు అని గుర్తు. సహనము వ్యక్తుల హృదయాలను గెలుస్తుంది.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి