Monday, November 25, 2024

ఆధ్యాత్మిక మార్గంలో నడవడము (ఆడియోతో…)

ఎవరైతే తమ పేరును ఆధ్యాత్మిక పాఠశాలలో నమోదు చేసుకుంటారో వారే ఆధ్యాత్మిక మార్గంలో నడవగలరు. ఇందులోని అన్ని సబ్జెక్టులలోనూ గౌరవప్రదంగా పాస్‌ కావడమే మన లక్ష్యం. అంటే ఆధ్యాత్మిక అవగహన, భగవంతుని శక్తి మన జీవితాలలో ఒక్క పరిస్థితినీ ఎదుర్కోకూడదు. హృదయము దయ, దాతృత్వంతో నిండి ఉండి బాధను ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చెయ్యకూడదు. భావాలు పవిత్రంగా అంటే ఎటువంటి కోరికలు, ఆశలు లేకుండా ఉండాలి. ఈ పవిత్ర భావాలను సమృద్ధిగా ఇతరులతో పంచుకోవాలి. దీనిని సాధించడానికి ఒక సన్యాసిలా అన్నీ వదలాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలోనే ఉంటూ ఇందులోని వికారాలకు, చెడుకు దూరంగా ఉండాలి.

ఇప్పుడు ఇటువంటి విజయవంతమైన విద్యార్థిగా కావాలసిన సమయం ఆసన్నమైంది. ఇందులో మనపై మనకు సంశయం రాకూడదు. భగవంతునిపై నమ్మకము వారి సహకారాన్ని తప్పకుండా అందిస్తుంది. భగవంతుని సహకారంతో పాటు మనలోని దృఢ సంకల్పం ముందుకు వెళ్ళడానికి, ఉన్నతి పొందటానికి కావలసిన శక్తిని ఇస్తుంది. భగవంతుడు మనకు అన్నీ ఇస్తున్నాడు. ఈ విషయంలో విశ్వాసము ఉంచి, ఆధ్యాత్మిక మార్గంలో వారిలా కావాలన్న సంకల్పంలో నిశ్చింతగా ముందుకు సాగండి.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement