Saturday, November 23, 2024

ఆధ్యాత్మిక జీవనానికి నాంది!

ప్రకృతి నియమాన్ని పరిశీ లిస్తే మనకు ఆరు విధులు గోచరమవుతాయి. అవి పుట్ట డం, పెరగడం, పోషించుకోవడం, ఉత్పత్తి చేయడం, క్షీణించడం, మర ణించడం. కొన్ని వృక్షాలు విత్తువేసినా, వేయకున్నా పుడమిపై వాటంతట అవే జన్మిస్తాయి. బీజాంకురంలో ఉన్న ఆహార శక్తిని వినియోగించుకొని మొలకెత్తిన మొక్క కొంత వరకు పెరిగి తరువాత సూర్యకాంతితో పోషణ చేసుకోవడం మొదలుపెడుతోంది. సమస్త జీవనానికి ఆధారభూతమైన భూమాత సహాయంతో ఫల పుష్పా లను ఉత్పత్తి చేస్తుంది. కొంతకాలం జీవించి తరువాత క్షీణించడం మొద లవుతుంది.
జంతు జాలం జీవన చక్రం కూడా ఇదేవిధంగా కొనసాగుతుంది. అలాగే మానవ జీవన పరిక్రమం కూడా కొనసాగుతోంది. కాని బుద్ధి జీవి జీవనపంథా మాత్రం వృక్ష, జంతువుల మాదిరి ప్రయోజన కరంగా ఉండకపోతే అది ప్రకృతి విరుద్ధమనిపించుకుంటుంది.
”బ్రతికినన్ని రోజులు ఫలములిచ్చుటే కాదు,
చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమందు తరువులే గురువులు”
అన్న శతకారుని మాటల్లో వృక్షరాజముల యొక్క త్యాగము మనం అవగతం చేసుకోవచ్చు. ప్రకృతిలో ప్రతి జీవి ఉనికి పూర్తి ప్రయోజనకరంగా ఉంటుంది. విజ్ఞుడైన మానవుడు మాత్రం స్వార్థం చేత ప్రకృతికి ఎదురు తిరుగుతూ తన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఈ అజ్ఞానానికి కారణం మన వేదవేదాంగాలను విస్మరించడం. పురాణ ఇతిహాసములను తరతరాలకు అందించకపోవడం.
ఆధ్యాత్మిక జీవన విధానాన్ని విస్మరించడం. అందువలన సమా జంలో అసుర లక్షణాలు ప్రబలిపోతున్నాయి.
నిజమైన ఆత్మ మనసు కాదు. మనసు ఒక పదార్థం. దానికి భౌతికమైన ఆహారంతోబాటు, తాత్వికమైన ఆలోచనా ఆహారం చాలా అవసరం. ఆలో చనా రహితంగా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. చివరకు నిద్రలో కూడా మనసు ఆలోచిస్తూ స్వప్నలోకంలో విహరిస్తుంది. మనసును స్వాధీ నం చేసుకున్నవాడే విశ్వ విజేత.
ఒక రకంగా ఆలోచిస్తే ప్రపంచం మన చుట్టూ లేదు. అది మనలోనే ఉంది. అర్థానికి, అనర్థానికి కారణం మనసు. బాల్యం నుండి మనసుకు సరైన శిక్షణ చాలా అవసరం. బాలబాలికలకు మొదటి గురువు తల్లి.
సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర తల్లులదే! తల్లికి మాతృత్వం లభించేది చాలా సహజమైన ప్రకృతి చర్య. పుట్టిన సంతానానికి సంస్కారం నేర్పడమే అసలైన సామాజిక చర్య.
గృహ నిర్వహణలో ఆధ్యాత్మిక మార్గం అత్యంత అవశ్యకం. అది పిల్లలకు తల్లి ద్వారానే అలవడుతుంది. ఇంటి గృహిణి, గృహస్తుడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం, నిత్య పూజ, దైవ ప్రార్థన మొదలైనవి భార్యాభర్తలు ఇద్దరూ చేయాలి. తల్లిదండ్రు ల నుంచి సంతానానికి లభించే కానుకలు అవి. గృహిణి ఆచరించే ఆధ్యా త్మిక జీవన మార్గం ఆ గృహాన్ని నిస్సందేహంగా పురోభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఇంటిలో చేసే నిత్యదీపారాధన, పూజాదికాలు ఆ కుటుంబ మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి.
విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మానవుని జీవితంలో ఒక భౌతికమైన అంశం. మనకి ఆహారం ఎలా అవసరమో విజ్ఞాన శాస్త్ర ఫలాలైన అనేక వైజ్ఞానిక పరికరాలు కూడా ఆధు నిక జీవనంలో అంతే అవసరమవుతున్నాయి. అయితే ఇవి ఆధ్యాత్మిక జీవనాభి లాషులకు ప్రతిబంధకంగా మారడం విచారకరం.
పిల్లలకు బాల్యంలో అలవడిన సంస్కారాలు మనసున ముద్ర పడతాయి. అందుకే పిల్లలతో చిన్నతనం నుండే శ్రీ రామాయణం, మహా భారతాల్లాంటి పురాణ గాథలు చెప్పాలి. పిల్లలు చదవడం నేర్పించాలి. అప్పుడే వారిలో ధర్మ జిజ్ఞాస మొదలవుతుంది. ఆధ్యాత్మిక జీవనం అలవడుతుంది.
పిల్లలకు ఈ పఠనం విజ్ఞాన శాస్త్ర అధ్యయానికి ఏమాత్రం ఆటం కం కాదు. పైగా విజ్ఞాన శాస్త్ర ఉపయోగాన్ని మానవ శ్రేయస్సుకు మరింత దోహదపడేలా చేస్తుంది. సంకల్పం మనసు నుండే జనిస్తుంది.
అది శుభసంకల్పం కావాలంటే చిన్నతనంలోనే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలకాలి. అప్పుడే తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, శ్రేయోభిలా షుల పట్ల గౌరవం, శ్రద్ధ కలుగుతాయి.
పెద్దల అనుభవసారాన్ని గ్రహించి జీవితంలో ఉపయోగించు కుంటారు. పటిష్టమైన జీవన పథాన్ని ఏర్పరచుకుంటారు. లేకపోతే అంత:కరణ చతుష్టయా లంటే తెలియకుండానే జీవితం ముగిసిపోతుంది.
ప్రస్తుత యువతకు మనోబలం తక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం స్వార్ధం. త్యాగ గుణం లోపించడం, మనసుకు చక్కని సంస్కారం లేకపోవడం. మనసును స్వాధీనం చేసుకోవడం చాలా క్లిష్టమైన విషయం. దానికి ఎంతో సాధన అవసరం.
ఏ వయసులోనైనా చక్కని సంస్కారవంతమైన వ్యాపకం చాలా అవసరం. వ్యాపకం లేని మనసు ధనస్సు నుండి వెలువడిన బాణం లాంటిది. అందువలన బాల్యం నుండే మన సనాతన వాఙ్మయం వారివారి స్థాయిని బట్టి పరిచయం చేస్తే వారు లోకోపకారులవడం నిశ్చయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement