Friday, November 22, 2024

ఆధ్యాత్మిక ఔషధము (ఆడియోతో…)

మనసు ప్రభావం శరీరంపై ఉంటుంది, అలాగే శరీర ప్రభావం మనసుపై ఉంటుంది. ఇవి రెండూ కలిసి పని చేస్తాయి. ఏ ఒక్క దానినీ నిర్లక్ష్యం చెయ్యడానికి వీలు లేదు. పద్ధతి ప్రకారం మందులు తీసుకోవడం తప్పేమీ కాదు. కానీ శరీరాన్నే చూసుకుంటూ మనసును పట్టించుకోకపోవడమే తప్పు. మందులు అవసరమైతే తీసుకోండి, కానీ వాటిపై పూర్తిగా ఆధారపడిపోకుండా చూసుకోండి.

మనసును టెన్షన్‌ నుండి, చింతల నుండి దూరంగా ఉంచినప్పుడు నిద్ర సహజంగా వస్తుంది. ఒక వేళ నిద్ర పట్టకపోయినా కానీ నువ్వు ఎంతో తాజాగా, ప్రశాంతంగా ఉంటావు. నీకు నువ్వే ఆధ్యాత్మిక వైద్యుడిగా అవ్వడం నేర్చుకో. అనారోగ్యం ఎటువంటిదైనా – గుండె నొప్పి, క్యాన్సర్‌, మామూలు నొప్పులు – మెడిటేషన్‌ శక్తితో, భగవంతుని స్మృతితో అనారోగ్యాన్ని అధిగమించవచ్చు. నీ స్నేహితులు, వైద్యులు నీ అనారోగ్యం గురించి చెప్పిన బాధాకర విషయాల నుండి కూడా రక్షిస్తుంది.

కొన్ని సార్లుకేవలం ఇతరుల అనారోగ్యాన్ని విన్న కారణంగానే కొంతమంది చింతలో మునిగి వారు అనారోగ్యం పాలవుతారు. నీకు ఏదైనా బాగలేకపోతే, దాని గురించి చింతించి, ఆ బాధను అందరికీ చెప్పడం ద్వారా నీ అనారోగ్యం మరింత పెరుగుతుంది. కనుక, శరీరం బలహీనంగా ఉన్నాకానీ మనసు భగవంతుని స్మృతిలో ఉండిపోవడం ఎలాగో నేర్చుకో. ఒకవేళ మనసులో కొద్దిగా అయినా బాధ ఉంటే ఎటువంటి వైద్యమైనా పనిచెయ్యదు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement