కోసల దేశంలో ఒక ఊరిలో వేద పండితుడు, బ్రాహ్మణోత్త ముడు ఉండేవాడు. ప్రజలు అందరూ అతనిని ”ఆత్మ జ్ఞాని”గా ప్రశంసిస్తూండేవారు. ఒకసారి ఆ విప్రుడు ఏకాంతంగా, కాలం గడుపుతూ, భగవంతుడుని ఉపాశించాలని భావించి తన భార్యతో చెప్పగా, ఆమె భక్తితో, ”స్వామీ! నాకు దయతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి, నన్ను తరింపచేసి, మీరు ఏకాంతంగా భగవత త్త్వాన్ని తెలుసుకోవలసిందని కోరింది. అపుడు పండితుడు చిరు నవ్వుతో భార్యతో ఇలా అన్నాడు. ”ఓ! వనితా! నీ మాటలతో నా హృదయం సంతోషపడింది. నీవు తెలుసుకోవడానికి అర్హురాలవే. కాబట్టి నువ్వు ధ్యానంతో, నేను చెప్పే మంచి విషయాలను విను.”ఓ! సాధ్వీమణీ! వినటానికి, చూడటానికి, చేయడానికి వీలైనన్ని పనులు అన్నీ కర్మలు. కర్మవాదులు (చేసేవారు) అజ్ఞానమనే చీకటి లో ఉన్నవారై, ఆ కర్మలే సమస్త సిద్ధులను ప్రసాదిస్తాయని, మోక్షాని కి హేతువని భ్రమలో ఉంటారు. అసలు ఈ జగత్తులో పుట్టుకతోనే కర్మలు సంభవిస్తాయి. నిష్కర్మత్వం (కర్మలు లేని స్థితి) అసలు లేనే లేదు. ఏ క్రియా లేని స్థితి అన్నది పరమోన్నతమైంది. ఇది బ్రహ్మ లక్షణం. అందుకే నేను ఆత్మలో నిరంతరం బ్రహ్మోపాసన చేస్తాను. ఆ బ్ర#హ్మత్వం వల్ల నిష్కళంకంగా ఉండగలుగుతున్నాను. ఓ! పద్మ లోచనా ప్రాణాపానాది పంచవాయువులు, మనస్సు, బుద్ధి, అనే ఏడూ వైశ్వానరుడికి జిహ్వలు. వైశ్వానరుడు అంటే ప్రాణుల దేహా లలో, వెలుగుతున్న ఆత్మతత్త్వమే. ఇంకా విపులంగా చెప్పాలంటే ప్రాణుల దేహాలలో అగ్ని రూపంగా ప్రాణాపానాలతో కూడినవాడై, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనబడే నాలుగు విధానాలైన ఆహారా లను వచనం చేస్తున్నదే. ఇది శరీరం లోపల రెండు రకాలుగా ఉం టుంది. మొదట సప్తహాత్వ విధి. అంటే వాసన చూడతగినది, తిన తగినది, చూడ తగినది, తాక తగినది, విన తగినది, ఆలోచింప తగి నది. తెలుసుకోతగినది. ఈ ఏడు సమిధులకు ఏడు ఋత్విక్కులు ఈ శరీరంలో కర్తవ్యం (హోమం) చేస్తున్నట్లే సుమా.
ఇక రెండవది దశహాత్వ విధి. ఇక్కడ వైశ్వానరుడి ముఖాలు పది ఉంటాయి. అవే దిక్కులు, వాయు వు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, ప్రజాపతి, మిత్రుడు అనబడేవి. ఆ ముఖాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు మాట్లాడ తగిన, చేయ తగిన, పోదగిన, విసర్జించ తగిన, ఆనందించ తగిన, అనే ఈ పది హోమ ద్రవ్యాలు. ఈ పదింటిని చెవి, చర్మం, కళ్ళు, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలు, నాలుక, చేతులు, కాళ్ళు, గుదం, జ్ఞానేంద్రియం అనే ఐదు కర్మేంద్రియాలు ఈ హోమం (కర్తవ్యం) చేస్తాయి. ఇదే దశహోతవిధానం. ఈ రెం డు పద్ధతులు గుర్తించి, జీవాత్మను ఉపద్రష్టగా ఉంచుకొని, ఈ అంత ర్యాగాన్ని జరిపే యోగులు సిద్ధులు, జననమ్ఖరణ భ్రమణం నుండి విముక్తులవుతారు. అలాకాకుండా, సాధారణంగా ఈ బాహ్య యజ్ఞానాన్ని జరిపేవారు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటా రు. ఓంకారం ఇత్యాదిగా ఉన్న మంత్ర రూపాల నుండే వాక్కు పుడు తుంది. దాన్ననుసరించి, పురుషార్థ సాధనకు మనసు పరుగెడు తుంది” అని చెప్పగా- భార్య ”పుణ్యాత్మా! మనసు ప్రేరేపిస్తేనే కదా వాక్కు పుడుతుంది. అటువంటప్పుడు, వాక్కు ననుసరించే మనస్సు ప్రవర్తించడం ఎలా సాధ్యపడుతుంది?” అని అడిగింది.
”ఓ! అర్థాంగీ! మనస్సు ఉదానవాయువుతో (కంఠం వరకు ఉండే వాయువు) కూడి వాక్కును ఆత్మ ప్రేరణతో బహర్గతం చేస్తుందని. అందరూ భావిస్తారు. అందులో దోషమేమీ లేదు. ఒక కార్యాన్ని గురించి ప్రస్థావించవలసినప్పుడు మాత్రం మనస్సు వాక్కుకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. వాక్కు- మనస్సులో, మనస్సు వాక్కులో అవిభక్తంగా ఉంటున్నాయి.
ఒకప్పుడు మనస్సుకు వాక్కుకు వాదం జరిగి బ్రహ్మదేవుడి వద్ద కు వెళ్ళి, ”స్వామీ! మా ఇద్దరిలో ఎవరు గొప్ప? చెప్పండి.” అనడిగా యి. అప్పుడు బ్రహ్మ మనస్సేగొప్పదని చెప్పారు. అక్కడే ఉన్న సర స్వతీదేవి ”వాక్కును నేనే కదా! అన్ని కోరికలను తీరుస్తూ, కార్యా లను చక్కదిద్దుతూంటే నన్ను తక్కువ చేయడం బాగోలేద”ని కొం చెం కోపంగా అంది. అప్పుడు బ్రహ్మ ”నాకు స్థిరమని, చరమని రెండు మనసులు ఉం టాయి. వాటిలో స్థిరం నావద్ద, చరం నీ వద్ద ఉంటాయి. నీ అను గ్రహంతో పుట్టే స్వరం వాక్కు- మంత్ర స్వరూ పాదులు అన్నీ చర చిత్తంగా ఉంటాయి. నీవు గొప్ప దానివే. నీ కన్న స్థిరం గొప్పది.” అని బ్రహ్మ చెప్పగా చిన్నబోయిన సరస్వతీదేవి ఎట్లా సర్థుకొంది?” అని భార్య అడిగితే బదులిస్తూ ”వాణి ప్రాణా పానాలను ఆశ్రయించి పుడుతుంది. వాణి క్షీణించగానే, ఆమెలోని ప్రాణవాయువు, బ్ర#హ్మ సహాయంతో క్షోభను పోగొట్టుకోగలిగింది.
వాక్కు, మనస్సు ప్రవర్తించే రీతులే మోక్షానికి మూలం. జ్ఞానేం ద్రియాలు వాటిపని అవి చేస్తున్నా సంశయించడం, తెలుసుకోవడం మనస్సు బుద్ధితో ప్రేరణతో జరుగుతుంది. అని వివరిస్తూ, ఇంకా ప్రాణతత్త్వం, జీవాత్మ స్వరూపం గురించి వివరించేసరికి, ఆమె సంతృప్తురాలైంది. దీనినే ”బ్రాహ్మణ గీత” అని అంటారు.
(మహాభారతం నుండి)
– అనంతాత్మకుల రంగారావు
7989462679